కుట్రలు, కుమ్మక్కులు చెల్లవు | Sakshi
Sakshi News home page

కుట్రలు, కుమ్మక్కులు చెల్లవు

Published Tue, Jul 3 2018 12:47 AM

Congress Party Welcoming Old Leaders Into Party - Sakshi

సమాధుల్లోని ప్రేతాల్లో కదలిక వచ్చింది. స్మశానాలకు పచ్చతోరణాలు కట్టి భ్రమల్లో ముంచెత్తే ప్రయత్నాలు మొదలయ్యాయి. అఖి లాంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అడ్డగో లుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు రంగం లోకి దిగారు.మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని మళ్లీ ఆ పార్టీలో చేర్చుకుంటారట. పార్టీకి దూర మైన నాయకులను, మాజీ ఎంపీలను మళ్లీ సంప్ర దిస్తున్నారట. వీరందరితో మళ్లీ గత వైభవా నికి పథక రచన చేస్తున్నారట. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. ఒక్కచోట కూడా డిపాజిట్‌ రాకుండా ఓడించారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒకసారి కాదు... వరసగా రెండుసార్లు ఘన విజయం సాధించడానికి కార ణమైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కనుమరుగయ్యాక ఆ పార్టీ అధి ష్టానం ఉమ్మడి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్త రిగా మార్చింది. అత్యంత జనాదరణ, అత్యధిక మంది పార్టీ ఎమ్మెల్యేల మద్దతుగల వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చెప్పుడు మాటలు విని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఓదార్పు యాత్రకు అడ్డం కులు సృష్టించడానికి ప్రయత్నించింది. ఆయన సోనియాగాంధీతో విభేదించి బయటకు వెళ్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి ఎదుగు తుంటే అధిష్టానానికి కంటగింపు అయింది.


ముఖ్యంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడుతో కుమ్మక్కయి జగన్‌మోహన్‌ రెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టించి జైలుకు పంపారు. ఆ కుటుంబాన్ని అనేక విధాల ఇబ్బం దులు పెట్టారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా బలహీనపరిచే ఉద్దేశంతో కాంగ్రెస్‌ అధి నాయ కత్వం ఆనాడు రాష్ట్ర విభజనకు కుట్ర పన్నింది. ఆరోజు లోక్‌సభ తలుపులు మూసి ప్రత్యక్ష ప్రసా రాన్ని నిలిపివేసి విభజన తీర్మానం ఆమోదించి నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ మాయోపాయాలను జనం ఎన్నటికీ మరువరు. ఈ పరిణామాలు, వాటి ఆంతర్యం తెలిసి కూడా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్‌ నాయకులు ఒక్కరంటే ఒక్కరు గట్టిగా పోరాడలేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అయితే చివరి వరకూ విభజన జరగ దని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం విభజన చేసినంత అత్యుత్సాహంగా,  విభజన హామీల అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయలేదు. కనుకనే ప్రత్యేక హోదా వంటి ముఖ్య మైన అంశంపై చంద్రబాబు మోదీ ప్రభుత్వానికి వంత పాడి నాలుగేళ్ల విలువైన కాలాన్ని వృధా చేశారు. అది అమలై ఉంటే ఈపాటికే వేలాదిమం దికి ఉపాధి దొరికేది. ఆంధ్ర ప్రజానీకానికి ఇలా అనేక విధాల ద్రోహం చేసినవారంతా రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలను వంచించేందుకు వస్తు న్నారు. మళ్లీ చంద్రబాబుతో కుమ్మక్కయి ప్రజ లను పక్కదోవ పట్టించి తెలుగుదేశానికి మేలు కలిగించేందుకే ఈ ఎత్తుగడలన్నీ.

వీరికి రాష్ట్ర ప్రజల విజ్ఞతపైనా, వివేకంపైనా తక్కువ అభి ప్రాయం ఉన్నట్లుంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు ఎగిసి వస్తున్న జన కెరటాలను గమనిస్తే, ఆయ నపట్ల అన్ని వర్గాల ప్రజలు చూపుతున్న ఆదరణ, విశ్వాసం పరిశీలిస్తే ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తిరుగులేని స్థాయిలో మెజారిటీ ఖాయమని స్పష్టంగా అర్ధమవుతుంది. నాలుగేళ్లుగా అన్ని వర్గాలనూ వంచించిన తెలుగుదేశం, రాష్ట్రాన్ని విభజించి ఇక్కట్లపాలు చేసిన కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసినా, తెరవెనక కుమ్మక్కయి విడివిడిగా పోటీకి దిగినా ప్రజలు వారిని నమ్మరుగాక నమ్మరు.అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆప డానికి ఈ రెండు పార్టీలు చేసే ప్రయత్నాలన్నీ జనాగ్రహంలో కొట్టుకుపోతాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయభేరి మోగిస్తుంది. ఆపార్టీకి ప్రజలు అత్యధిక మెజా
రిటీ ఇచ్చి ప్రత్యేక హోదాను సాధించుకోవడం ఖాయం.

పిల్లి ప్రేమకుమార్, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా ‘ 85558 70102 

Advertisement
Advertisement