ప్రజా ప్రతినిధుల మాటేమిటి?

3 Nov, 2017 00:58 IST|Sakshi

విశ్లేషణ

జనం, ఆర్టీఐ కార్యకర్తలు, ప్రజాస్వామ్య ప్రియులు.. తాము రాజకీయ పార్టీల పారదర్శకతను కోరుకుంటున్నామో లేదో ముందుగా తేల్చుకోవాలి. జనం గట్టిగా కావాలనుకుంటే పార్టీల జవాబుదారీతనాన్ని సాధించగలుగుతారు.

ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు పబ్లిక్‌ అథారిటీలు అవుతాయని 2013లో లా కమిషన్‌ సమాచార హక్కు చట్టం కింద ప్రకటించింది. రాజకీయ పార్టీలను సమాచారం ఇమ్మని అడిగిన వారి సంఖ్య లెక్కలోకి రానంత తక్కువ. ఢిల్లీలో కొందరు అడి గినా, వారికి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం కొన్ని ఫిర్యాదులకు సంబంధించిన కేసులు కమిషన్‌ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రాలలో ఎందరు ఫిర్యాదు చేశారో తెలియదు. జనం, ఆర్టీఐ కార్యకర్తలు, ఇతర ప్రజాస్వామ్య ప్రియులు, తాము రాజకీయ పార్టీల పారదర్శకతను కోరుకుంటున్నామో, లేదో ముందుగా తేల్చుకోవాల్సి ఉంది. రాజకీయ నాయకులు, పార్లమెం టరీ/శాసన సభాపక్ష పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలో, వద్దో తేల్చుకోవాల్సి ఉంది. జనం గట్టిగా కావాలను కుంటే పార్టీల నుంచి జవాబుదారీతనాన్ని సాధించ గలుగుతారు. ఇతర రాజకీయ పార్టీలనన్నింటినీ ఆర్టీఐ కింద పబ్లిక్‌ అథారిటీలుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది.

పార్లమెంటు/శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు/ఎమ్మెల్యేలతో ఆయా పార్టీల పార్లమెంటరీ పార్టీలు/లెజిస్లేచర్‌ పార్టీలు ఏర్పడతాయి. ప్రతి ఎంపీకి ఏటా రూ. 5 కోట్లు లాడ్స్‌ నిధులు కేటాయిస్తారు (ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్రాలనుబట్టి ఈ నిధి ఉంటోంది). ప్రజా ప్రతినిధి సూచించిన అభివృద్ధి పనులను ఆయా జిల్లా అధికా రులు అమలు చేయవలసి ఉంటుంది. ఈ నిధులను గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ ఉంటుంది. కాని ఏ ప్రాంతంలో ఎవరి దర ఖాస్తుల ఆధారంగా ఏ అభివృద్ధి పనులను చేపట్టాలో నిర్ణయించే పూర్తి విచక్షణాధికారం ప్రజా ప్రతినిధులకే ఉంది. ఆ అభివృద్ధి పనుల పరిస్థితిని వివరించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఉంది. ఈ విషయమై వారు ప్రజలకు జవాబు దారీగా ఉండటానికి ఆర్టీఐని వర్తింపచేయవలసి ఉంటుంది. పూర్తి ఆర్థిక పారదర్శకతను పాటించవలసి ఉంటుంది. ప్రతి లెజిస్లేచర్‌/పార్లమెంటరీ పార్టీ సమా చార అధికారిని, మొదటి అప్పీలు వినే అధికారిని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత రెండో అప్పీలును కమిషన్లు వినాలి. ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్‌ వివరాలను వారు తమంత తామే సెక్షన్‌ 4(1)(బి) కింద ప్రక టించాలి. కానీ ఈ విధంగా ఎవరూ అడగడమే లేదు.

విష్ణుదేవ్‌ భండారి అనే ఓటరు బిహార్‌లోని మధు బని జిల్లా ఖతౌనా  ప్రాంతంలో ఎంపీ లాడ్స్‌ కింద ఏ పనులను చేపట్టారు, అవి ఏ దశలో ఉన్నాయని ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. సీపీఐఓ జవాబే ఇవ్వ లేదు. మొదటి అప్పీలూ వృథా అయింది. రెండో అప్పీలు విచారణలో పాల్గొన్న మంత్రిత్వ శాఖ అధి కారులు, నిధులు మంజూరు చేసి విడుదల చేయడం తప్ప తమకు మరెలాంటి సంబంధం లేదన్నారు. నెల రోజులకు పైగా ఏ స్పందనా లేకపోతే దాన్ని తిర స్కారంగా భావించాలని సెక్షన్‌ 7(2) వివరిస్తున్నది. కమిషన్, సమాచార అధికారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని ఆదే శించింది. రాజకీయ పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీల ద్వారా ఎంపీ లాడ్స్‌ వంటి సమాచారం వెంట వెంట ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది. పార్లమెంటరీ పార్టీలను పబ్లిక్‌ అథారిటీలుగా ఎందుకు ప్రకటించకూడదో వివరించాలని కూడా కోరింది. జిల్లా ప్రణాళికాధికారి కార్యాలయం కొంత సమాచారం సేక రించి విష్ణుదేవ్‌కు ఇచ్చింది. లోకసభ సచివాలయం తమకు ఈ నిధుల వినియోగంతో ఏ సంబంధమూ లేదని, మరిన్ని వివరాలకు జిల్లా అధికార యంత్రాం గాన్ని సంప్రదించాలని అంది.

బిహార్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో రూ. 200 కోట్లకుగాను 87.5 కోట్లు ఉపయోగించారని, రాజ్యసభ నియోజకవర్గాలకు సంబంధించి రూ. 80 కోట్లలో రూ. 25 కోట్లు విడుదల చేశారని ప్రభుత్వ సమాచారం. అధికారిక వివరాలను పరిశీలిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధుల పట్ల బాధ్యతగా వ్యవ హరించడం అవసరం అనిపిస్తుంది. చాలా మంది ఎంపీలు తగు యంత్రాంగం, లాడ్స్‌ నిధులు ఉన్నా వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం విచిత్రం.  జనం కూడా పట్టించుకోకపోతే ఈ పథకం ప్రయో జనాలు నెరవేరవు. ఎన్నికైన ప్రజాప్రతినిధులున్న ప్రతి పార్టీ తన పార్లమెంటరీ పార్టీని ఆర్టీఐ కింద పబ్లిక్‌ అథారిటీగా భావించి, నూటికి నూరు శాతం ఎంపీ లాడ్స్‌ నిధులను వినియోగించడమేగాక, సమాచారాన్ని తామే స్వయంగా ఇవ్వాలి. వివరాలు కోరిన వారికి ఆర్టీఐ కింద ఇవ్వాలని కమిషన్‌ సూచించింది. ఏ స్పందనా లేకుండా, సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు గాను విష్ణుదేవ్‌ భండారికి వెయ్యి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది.

(CIC/MOSPI/A/2017/176195, Vishnu Dev Bhandari v. PIO, M/o Statistics&Programme Implementation కేసులో ఆక్టోబర్‌ 18న ఇచ్చిన తీర్పు ఆధారంగా).మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా