ఇక గర్భనిరోధక మాత్రలతో పనిలేదట! | Sakshi
Sakshi News home page

ఇక గర్భనిరోధక మాత్రలతో పనిలేదట!

Published Thu, Apr 14 2016 3:21 PM

ఇక గర్భనిరోధక మాత్రలతో పనిలేదట! - Sakshi

లండన్: మహిళలు భవిష్యత్లో గర్భనిరోధక మాత్రలను  తీసుకోనవసరం లేదా? అవుననే అంటోంది  'నేచురల్ సైకిల్' పేరుతో వస్తున్న ఆండ్రాయిడ్ యాప్.  ఈ యాప్ సహాయంతో  గర్భం దాల్చే  అవకాశాలను తెలుసుకోవచ్చునని ఎస్బీస్.కామ్ ప్రచురించింది. ఒక మహిళ రోజూవారి శారీరక ఉష్ణోగ్రతల తేడాను యాప్లోని అల్గారిథమ్ ద్వారా తెలుసుకోవచ్చని  తేల్చారు.  తాజా ఆవిష్కరణ  ద్వారా  ఫెర్టిలిటీకి సంబంధించిన సూచనలను తెలుసుకోవచ్చని, తద్వారా అవాంఛిత గర్భాలను నిరోధించ వచ్చని పరిశోధకులు చెబుతున్నారు.   

 గర్భనిరోధక మాత్రలతో పనిలేకుండా, నేచురల్ సైకిల్స్ డేటాను ఉపయోగించుకుని గర్భధారణను నియంత్రించుకోవచ్చని  ఈ యాప్ను తయారుచేసిన వారిలో ఒకరైన ఎలినా బెర్గ్లండ్ చెప్పారు. స్వీడన్లో 4,000 వేల మందికి పైగా 25-30 ఏళ్ల వయసు గల మహిళలపై నిర్వహించిన పరిశోధనల్లో పెర్ల్ ఇండెక్స్లో గర్భనిరోధక మాత్రల్లానే నేచురల్ సైకిల్స్ కూడా పనిచేయడాన్ని గమనించారు. ఒక సంవత్సరకాలంలో ఎంతమంది మహిళలు యాక్సిడెంటల్గా గర్భం ధరిస్తున్నారన్న విషయాన్నిపరిశీలించారు.

పిల్ ఉపయోగిస్తున్నవెయ్యి మంది స్త్రీలలో ముగ్గురు అనుకోకుండా గర్భం ధరిస్తోంటే. ఈ  యాప్ను ఉపయోగించిన వారిలో ప్రతి వెయ్యి మందిలో  ఐదుగురు స్త్రీలు మాత్రమే అనుకోకుండా గర్భం ధరించడం విశేషమని యాప్ రూపకర్తలు వెల్డడించారు.  యూరోపియన్ జర్నల్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండ్ రీ ప్రొడక్టివ్ హెల్త్ కేర్  లో ఈ పరిశోధనా పత్రం ప్రచురితమైంది.

Advertisement
Advertisement