గుండెపోటును గుర్తించాలంటే ఇలా చేయాలట! | Sakshi
Sakshi News home page

గుండెపోటును గుర్తించాలంటే ఇలా చేయాలట!

Published Sat, Apr 16 2016 3:58 PM

గుండెపోటును గుర్తించాలంటే ఇలా చేయాలట! - Sakshi

వాషింగ్టన్: భవిష్యత్లో రాబోయే గుండెజబ్బును గుర్తించేందుకు రెండు చేతులకు కచ్చితంగా  రక్తపోటు పరీక్షలను చేయించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.  దీని మూలంగా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని  సరైన సమయంలో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కుడి,ఎడమ చేతులకు ఈ పరీక్ష చేయడం వల్ల రీడింగ్లలో తేడాలను గుర్తించినట్టు చెబుతున్నారు. తరచుగా బీపీ పరీక్షను చేయించుకునేపుడు రెండు చేతులకు చేయించుకోవాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు.  సుమారు  3,000 మందికిపై  పరిశోధన  నిర్వహించినపుడు ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తేలాయని చెబుతున్నారు.   

  ఒక చేతికి మాత్రమే బీపీ చెక్ చేసినప్పుడు, రెండు చేతులకు బీపీ చెక్ చేసినపుడు గణనీయమైన మార్పును గమనించామన్నారు.  వీటి తేడాలో 5 పాయింట్లు ఎక్కువగా రక్తపోటు కలిగిన వారికి గుండెపోటు వచ్చే ఆస్కారం రెండు రెట్లు అధికంగా ఉంటుందని తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు జరిపిన పరిశోధనల్లో 60 శాతం మందిలో ఈ తేడా కనిపించిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బీపీ పరీక్ష స్థానంలో ఈ పరీక్షకు అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఈ పరీక్షను తరచూ చేయించుకోవడం వల్ల ఆరోగ్యంలో తేడాలను సులభంగా గుర్తించవచ్చని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ క్రిస్ క్లార్క్ తెలిపారు.

ఈ పరీక్షల ద్వారా వేరే ఏవైనా జబ్బులు వచ్చే అవకాశాలను గుర్తించగలమా అనే అంశంపైనా,  వీటికి పరిష్కార మార్గాలపై పరిశోధనలు చేయనున్నట్లు వివరించారు. పరీక్షలో ఎటువంటి రిస్క్ కనిపించని వాళ్లూ జబ్బు బారిన పడకుండా ఉండేందుకు హైపర్టెన్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించుకునే ముందు బీపీ పరీక్ష చేయించుకోవాలని ప్రొఫెసర్ జెరెమ్ పియర్సన్ తెలిపారు.ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను బ్రిటీష్కు చెందిన జర్నల్ ఆఫ్ జనరల్ ప్రాక్టీస్లో ప్రచురించారు.

Advertisement
Advertisement