శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం: 10 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం: 10 మందికి గాయాలు

Published Tue, Jan 26 2016 8:40 AM

10 injured in road accident at shamshabad

హైదరాబాద్: శంషాబాద్ మండలంలో పాలమాకుల వద్ద మంగళవారం ఓ ప్రైవేటు బస్సు, డీసీఎమ్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు(AP 03 EC 4466) చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement