బిట్స్ రెండో దశకు శంకుస్థాపన | Sakshi
Sakshi News home page

బిట్స్ రెండో దశకు శంకుస్థాపన

Published Sat, Feb 20 2016 1:11 PM

బిట్స్ రెండో దశకు శంకుస్థాపన - Sakshi

శామీర్‌పేట్: రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో శనివారం రెండో దశ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... బిట్స్ పిలానీలో రెండో దశ విస్తరణలో భాగంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 370 కోట్లతో నిర్మాణాలు చేపడతారని వెల్లడించారు.
 
బిట్స్ పిలానీ హైదరాబాద్ లో ప్రస్తుతం 3,200 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు. నూతన భవనం పూర్తయితే అదనంగా 5,300 మంది విద్యార్థులు చదివేందుకు వీలుంటుంది. బిట్స్ చైర్మన్ కుమార మంగళం ఆశయాన్ని(10 వేల మంది విద్యార్థులు) సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బిట్స్ డెరైక్టర్ వి.ఎస్.రావు మాట్లాడుతూ నూతన భవనం 2018 చివరికి పూర్తవుతుందని చెప్పారు.
 

Advertisement
Advertisement