ఎయిర్‌కోస్తా విమానం అత్యవసర లాండింగ్ | Sakshi
Sakshi News home page

ఎయిర్‌కోస్తా విమానం అత్యవసర లాండింగ్

Published Wed, Feb 17 2016 5:32 PM

emergency landing of Air -coast flight

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌కోస్తా విమానం బుధవారం సాయంత్రం అత్యవసరంగా లాండింగ్ అయింది. ఈ విమానం మధ్యాహ్నం 2.45 గంటలకు శంషాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరింది. బ్రేక్ ఫెయిలైనట్టు గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందకు దింపేశాడు. 120 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

 

Advertisement
Advertisement