కుమారుడి చేతిలో తండ్రి హతం | Sakshi
Sakshi News home page

కుమారుడి చేతిలో తండ్రి హతం

Published Tue, Feb 23 2016 2:15 PM

Father killed by son

ఆలేరు మండలం మందనపల్లిలో సోమవారం అర్ధరాత్రి సమయంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. మందనపల్లి గ్రామానికి చెందిన సంతోష్ తన తండ్రి దగిడి ఇఫ్తారీ(60)ని సోమవారం అర్ధరాత్రి సమయంలో రోకలిబండతో మోదాడు. తీవ్రగాయాలపాలైన ఇఫ్తారీని చికిత్స హైదరాబాద్- ఉప్పల్‌లోని ఆదిత్య ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నాం మృతిచెందాడు. సంతోష్ మానసిక స్థితి 6 నెలలుగా సరిగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement