గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్మాది వీరంగం | Sakshi
Sakshi News home page

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్మాది వీరంగం

Published Tue, Jan 12 2016 10:18 AM

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్మాది వీరంగం - Sakshi

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. వార్డులోని డాక్టర్లు, అటెండర్లపై దాడి చేసి ఓ గంటపాటు విధ్వంసం చేశాడు. తమిళనాడుకు చెందిన ముదివానంద్ అనే వ్యక్తి సోమవారం రాత్రి బాపట్ల సమీపంలో రైలు నుంచి జారి కిందపడ్డాడు. గాయపడిన అతడ్ని చికిత్స కోసం జీఆర్పీ పోలీసులు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
మంగళవారం తెల్లవారుజామున ముదివానంద్ ఓ నర్సు చేయి పట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడున్న వైద్యులు రజనీకాంత్, ఆదిత్య అతడ్ని వారించారు. దీంతో ముదివానంద్ వైద్యులపై చేయి చేసుకున్నాడు. అడ్డొచ్చిన అటెండర్లు మల్లయ్య, శ్రీనుపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత చేతికి దొరికిన వస్తువులతో అద్దాలు పగులగొట్టి గంటపాటు విధ్వంసం సాగించాడు. చివరికి అక్కడున్న వారు అతడ్ని పట్టుకుని ఓ ఆటోకు తాళ్లతో కట్టేశారు. ఘటనపై హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

Advertisement
Advertisement