టుడే న్యూస్ డైరీ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Published Mon, Mar 21 2016 6:34 AM

today news diary

► తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం. తెలంగాణలో 5.67 లక్షల మంది, ఏపీలో 6.57 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

► నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఉదయం అంబేద్కర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. సాయంత్రం జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీ అమెన్మెంట్ బిల్లు, తెలంగాణ వ్యాట్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

► నేడు ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రోజా సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వం.. కోర్టు తీర్పును గౌరవించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ సభను బహిష్కరించనుంది.

► ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు.

► సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఎప్రిల్ 6న పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు ఎప్రిల్ 11న వెలువడనున్నాయి.

► ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఫైన్తో వచ్చే నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ.

► వరల్డ్ కప్ టీ20లో భాగంగా నేడు రాత్రి 7.30 గంటలకు ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడనుంది.
 

Advertisement
Advertisement