గ్రూప్‌–2లో 17 ప్రశ్నలు తొలగింపు | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2లో 17 ప్రశ్నలు తొలగింపు

Published Sat, Jan 14 2017 3:19 AM

గ్రూప్‌–2లో 17 ప్రశ్నలు తొలగింపు

  • 8 ప్రశ్నలకు 2 కంటే ఎక్కువ సరైన సమాధానాలు
  • టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫైనల్‌ కీ
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి నిర్వ హించిన గ్రూప్‌–2  పరీక్షలో మొత్తం 17 ప్రశ్నలను టీఎస్‌పీ ఎస్సీ తొలగించింది. మరో 8 ప్రశ్నలకు రెండు, అంతకంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయని, వాటిల్లో ఏదీ రాసినా సరైన సమాధానం అవుతుందని వెల్లడించింది. తొలగించిన ప్రశ్నలను మినహాయించి మిగతా ప్రశ్నలకు మార్కులు లెక్కించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలు, తొలగించిన ప్రశ్నల వివరాలతో కూడిన ఫైనల్‌ కీని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. మొత్తం 4 పేపర్లలో 17 ప్రశ్నలు తొలగించినట్లు తెలిపింది. నవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌–2 పరీక్షలకు మొత్తం 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,98,944 మంది హాజరయ్యారు.

    ఆ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ గత నెల 2న తమ వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది. వాటిపై డిసెంబర్‌ 5 నుంచి 14 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, పరిశీలన చేయించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు 600 ప్రశ్నలతో కూడిన నాలుగు పేపర్లలో సరైన సమాధానాలు లేనందున 17 ప్రశ్నలను తొలగించింది. పేపర్‌–1లో 6 ప్రశ్నలు, పేపర్‌–2లో 5 ప్రశ్నలు, పేపర్‌–3లో 3 ప్రశ్నలు, పేపర్‌–4లో 3 ప్రశ్నలను తొలగించింది. మరో 8 ప్రశ్నలకు 2, అంతకంటే ఎక్కువ సమాధానాలు ఉన్నట్లు తేల్చింది. ఇందులో పేపర్‌–1లో 2 ప్రశ్నలకు, పేపర్‌–2లో ఒక ప్రశ్నకు, పేపర్‌–3లో 4 ప్రశ్నలకు, పేపర్‌–4లో ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలున్నట్లు గుర్తించింది. తాజాగా ప్రకటించిన ఫైనల్‌ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని టీఎస్‌పీఎసీ వెల్లడించింది.

    పేపర్ల వారీగా తొలగించిన,ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్న ప్రశ్నలు
    పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీఎస్‌), ఏబీ సిరీస్‌లో..
    తొలగించినవి: 38, 70, 78, 93, 108, 139వ ప్రశ్నలు.
    ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 17వ ప్రశ్నకు 3 లేదా 4వ ఆప్షన్‌ సరైంది. 77వ ప్రశ్నకు 3 లేదా 1 లేదా 2వ ఆప్షన్‌ సరైంది.
    పేపర్‌–2 (హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ), ఏబీ సిరీస్‌లో..
    తొలగించినవి: 40, 94, 104, 113, 131.
    ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 28వ ప్రశ్నకు 2 లేదా 3వ ఆప్షన్‌ సరైంది.
    పేపర్‌–3 (ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌), ఏబీ సిరీస్‌లో..
    తొలగించినవి: 20, 53, 124.
    ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 59వ ప్రశ్నకు 1 లేదా 2వ ఆప్షన్‌ సరైన సమాధానం. 94వ ప్రశ్నకు 2 లేదా 3వ ఆప్షన్‌ సరైంది. 118వ ప్రశ్నకు 1 లేదా 4వ ఆప్షన్‌ సరైంది. 134వ ప్రశ్నకు 1 లేదా 4వ ఆప్షన్‌ సరైంది.
    పేపర్‌–4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం), ఏబీ సిరీస్‌లో..
    తొలగించినవి: 16, 51, 80.
    ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 32వ ప్రశ్నకు 1 లేదా 2వ ఆప్షన్‌ సరైంది.

Advertisement
Advertisement