పోలీస్ అవార్డుల కోసం 22 మంది | Sakshi
Sakshi News home page

పోలీస్ అవార్డుల కోసం 22 మంది

Published Wed, Apr 27 2016 5:33 AM

పోలీస్ అవార్డుల కోసం 22 మంది - Sakshi

అధికారుల పేర్లను  కేంద్రానికి పంపిన రాష్ట్రం
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (ఐపీఎం), ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ (పీపీఎం) అవార్డులకు సంబంధించి 22 మంది అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించింది. రాష్ట్ర హోంశాఖ రూపొందించిన ఈ జాబితాను ప్రభుత్వం పరిశీలించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐపీఎం, పీపీఎంలకు ఎంపికైన అధికారులకు ఈ అవార్డులను అందజేస్తారు.

ఐపీఎం కేటగిరీలో 17 మంది, పీపీఎం కేటగిరీలో ఐదుగురు పోలీసు అధికారుల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తూ జాబితా పంపించింది. వీరిలో ఐపీఎం కేటగిరీలోని ముగ్గురు, పీపీఎం కేటగిరీలోని ఐదుగురికి సంబంధించిన వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)ను కేంద్రానికి అందించిం ది. మిగతా వారి ఏసీఆర్ కూడా త్వరలో పంపనుంది. రెండు విభాగాలలో కలిపి ఐదుగురు ఐపీఎస్ అధికారులున్నారు.
 
 ఐపీఎం కోసం కేంద్రానికి పంపిన జాబితా
 1. సి.రవివర్మ, ఐపీఎస్, డీఐజీ సైబర్ క్రైం, సీఐడీ
 2. వి.శివకుమార్, ఐపీఎస్, జాయింట్ డెరైక్టర్, ఏసీబీ
 3. ఎరబాటి శ్రీనివాసరావు, కమాండెంట్, 7వ బెటాలియన్, టీఎస్‌ఎస్‌పీ
 4. సీహెచ్ నరోత్తంరెడ్డి, అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్  
 5. కె.ఎస్.నటరాజన్ బాలాజీ, అసిస్టెంట్ కమాండెంట్,15వ బెటాలియన్, టీఎస్‌ఎస్‌పీ
 6. మురళీకృష్ణ, ఏఎస్‌పీ, ఎస్‌ఐబీ
 7. ఎస్‌కే నజీముద్దీన్, ఏసీబీ, పాస్‌పోర్ట్
 8. ఎ.బాలకోటి, డీఎస్పీ, మహబూబ్‌నగర్ జిల్లా
 9. కె.జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ, ఎస్‌ఐబీ
 10. అంగార వెంకటసత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ ఎస్‌బీ, సైబరాబాద్
 11. కె.రమణారెడ్డి, ఏఎస్‌ఐ, సీసీఎస్, వరంగల్ రూరల్
 12. డీహెచ్ వీరనాగయ్య, ఏఎస్‌ఐ, ఇంటెలిజెన్స్
 13. వి.పాండురంగారావు, ఏఎస్‌ఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్
 14. చిలుకూరు సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్, ఎస్‌బీ, సైబరాబాద్
 15. మహ్మద్ అబ్దుల్ నయీం, హెడ్ కానిస్టేబుల్, ఫస్ట్ బెటాలియన్
 16. డి.బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్
 17. రమేశ్‌బాబు, గ్రేహౌండ్స్
 
 పీపీఎం కోసం అధికారుల జాబితా...   
  1.రాజీవ్త్రన్, ఐపీఎస్, ఫైర్ డీజీ
 2. సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్
 3. టీవీ శశిధర్‌రెడ్డి, జాయింట్ సీపీ, సైబరాబాద్
 4. కె.రామ్మోహన్, ఏఎస్పీ, సైబర్ క్రైం, సీఐడీ
 5.ఎం.రామకృష్ణ, డీఎస్పీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్

Advertisement
Advertisement