ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత

Published Tue, Apr 1 2014 9:39 AM

ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత

దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల లగేజీ నుంచి దాదాపు 7 కేజీల  స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం దుబాయి నుంచి నగరానికి చేరుకున్న ఆ ప్రయాణికుల లగేజిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 

ఈ సందర్బంగా ప్రయాణికుల లగేజీలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం సదరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement