వ్యక్తిగత ఫొటోలతో యువతిని బ్లాక్‌మెయిల్ | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత ఫొటోలతో యువతిని బ్లాక్‌మెయిల్

Published Sat, Mar 25 2017 6:57 PM

వ్యక్తిగత ఫొటోలతో యువతిని బ్లాక్‌మెయిల్ - Sakshi

హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ యువతిని ఆన్‌లైన్‌లో వేధిస్తున్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ రెడ్డి కథనం ప్రకారం... బాధితురాలు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సహోద్యోగి అయిన బి.దినేశ్‌ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని దినేశ్‌ కుమార్‌ చెప్పడంతో ఆమె నో చెప్పింది. అప్పటినుంచీ ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లోని వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్‌ నంబర్లు సేకరించాడు. తనను ప్రేమించకుంటే ఆ వ్యక్తిగత ఫొటోలను తల్లిదండ్రులు, బంధువులకు పంపుతానంటూ బాధితురాలిని బెదిరించాడు.

ఆమె లొంగకపోవటంతో పలు నంబర్ల నుంచి, పలు మెయిల్‌ ఐడీల నుంచి బాధితురాలి బంధువులకు ఫొటోలు పంపించాడు. తన ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి కూడా ఆమె వ్యక్తిగత ఫొటోలను బాధితురాలి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులకు సెండ్ చేశాడు . దినేశ్ వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవటంతో రాచకొండ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం దినేశ్‌ ను హిమాయత్‌నగర్‌లో అదుపులోకి తీసుకుంది. పోలీసులు అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement