ఈ–పోర్టల్‌ ద్వారా అగ్రి, అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలం | Sakshi
Sakshi News home page

ఈ–పోర్టల్‌ ద్వారా అగ్రి, అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలం

Published Fri, Apr 28 2017 1:26 AM

ఈ–పోర్టల్‌ ద్వారా అగ్రి, అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలం - Sakshi

- ప్రాథమిక నిర్ణయం తీసుకున్న హైకోర్టు
- నేడు వెలువడనున్న పూర్తిస్థాయి ఉత్తర్వులు


సాక్షి, హైదరాబాద్‌: సీఐడీ తమ ముందుంచిన అగ్రిగోల్డ్‌ 12 ఆస్తులను, అక్షయగోల్డ్‌ 5 ఆస్తులను ప్రభుత్వ ఈ పోర్టల్‌ ద్వారా వేలం వేసేందుకు ఉమ్మడి హైకోర్టు ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శుక్రవారం పూర్తిస్థాయిలో ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్లు హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ప్రభుత్వ ఈ పోర్టల్‌ ద్వారానే 17 ఆస్తుల వేలం జరుగుతుందని స్పష్టం చేసింది. వేలం విధివిధానాలను, ప్రచారం తదితర విషయాలపై శుక్రవారం ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది.

Advertisement
Advertisement