టెర్రరిస్టుల కోసం ఓ యాప్‌..! | Sakshi
Sakshi News home page

టెర్రరిస్టుల కోసం ఓ యాప్‌..!

Published Mon, Jan 23 2017 2:09 AM

టెర్రరిస్టుల కోసం ఓ యాప్‌..! - Sakshi

► ఉగ్రవాదుల కోసం రూపొందించిన ఐసిస్‌
► జేకేబీహెచ్‌ మాడ్యుల్‌ విచారణలో వెలుగులోకి..


సాక్షి, హైదరాబాద్‌: ‘అమన్‌ అల్‌ ముజాహిద్‌’పేరుతో ఓ ప్రత్యేక మొబైల్‌ యాప్‌.. ఈ–మెయిల్స్‌ మార్పిడికి ఎన్‌క్రిప్టెడ్‌ విధానం.. టోర్‌ ఆధారంగా డార్క్‌ నెట్‌ వినియోగం.. ఉగ్రవాదుల గోప్యత, భద్రత కోసం అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన ఐసిస్‌ అనుబంధ సంస్థ ‘జుందుల్‌ ఖిలాఫ్‌ ఫీ బిలాద్‌ అల్‌ హింద్‌ (జేకేబీహెచ్‌)’ఉగ్రవాదులు మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్‌ ఇలియాస్‌ యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్‌ అథవుర్‌ రెహ్మాన్, అబ్దుల్‌ బిన్‌ అహమద్‌ అల్‌మౌదీ అలియాస్‌ ఫహద్, హబీబ్‌ మహ్మద్, ముజఫర్‌ హుస్సేన్‌ రిజ్వాన్, మహ్మద్‌ ఇర్ఫాన్‌ల విచారణ, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్ల ద్వారా ఈ కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల్లో నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో ఈ వివరాలను ఎన్‌ఐఏ అధికారులు పొందుపరిచారు.

హైటెక్‌ విస్తరణ..
నిఘాకు చిక్కకుండా, ఉగ్రవాదుల ఉనికి బయటపడకుండా ఐసిస్‌ అనేక జాగ్రత్తలు తీసు కుంటోంది. ఇందుకోసం అల్‌ ఫజర్‌ మీడియా సెంటర్‌ పేరుతో ఓ మీడియా వింగ్‌ పని చేస్తోంది. ఈ విభాగం యాప్స్, డార్క్‌ నెట్‌ సైట్స్‌  నిర్వహిస్తోంది. వీటి ఆవిష్క రణ, అభివృద్ధికి అల్‌ ఫజర్‌ టెక్నికల్‌ కమిటీ సైతం ఏర్పాటైం ది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌గా పని చేసే అమన్‌ అల్‌ మజా హిద్‌ పేరుతో ఓ యాప్‌ను, టుటానోటా యాప్, డార్క్‌ నెట్‌ వినియోగంపై మాన్యువల్‌ని ఎఫ్‌టీసీ రూపొందించింది.

ఏమిటీ ‘క్రిప్షన్స్‌’...
యాప్స్‌ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించిన పరిజ్ఞానమే ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్‌. ఓ సెండర్‌ పంపిన మెసేజ్‌ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్‌ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్‌ చేస్తే అది ఎన్‌క్రిప్ట్‌ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. సెండర్‌ నుంచి సర్వీసు ప్రొవైడర్‌ ద్వారా సాంకేతిక రూపంలో రిసీవర్‌ వరకు జరిగే ప్రయాణం మొత్తం ఆ సందేశం ఎన్‌క్రిప్షన్‌ విధానంలోనే జరుగుతుంది. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న సందేశాన్ని డీక్రిప్షన్‌లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిç Ü్తుంది. ఈ కీల్లోనూ 2 రకాలు ఉంటాయి. పబ్లిక్‌ కీతో కూడిన ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాన్ని ‘మధ్య’లో ఎవరైనా సంగ్రహించే ఆస్కారం ఉన్నప్పటికీ... ప్రైవేట్‌ కీతో ఉండే సందేశాన్ని డీక్రిప్ట్‌ చేయడం సాధ్యం కాదు.  కేంద్ర నిఘా వర్గాలు ‘మ్యాన్‌ ఇన్‌ మిడిల్‌’అనే విధానం ద్వారా అనుమానిత నంబర్లపై కన్నేసి ఉంచుతారు. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో ఉండే యాప్‌ల ద్వారా జరిగే సమాచార మార్పిడిని ఎంఐఎం ద్వారా నిఘా వర్గాలు సంగ్రహించినా.. కేవలం కీ తెలుసుకోవడం తప్ప అందులోని వర్డ్స్‌ను గుర్తించలేదు.

టోర్‌ ద్వారా డార్క్‌ నెట్‌ వినియోగం..
ఐసిస్‌ అనుబంధ జేకేబీహెచ్‌ ఉగ్రవాదులు డార్క్‌ నెట్‌ను వినియోగించారని వారి సెల్‌ఫోన్ల విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది.  పోలీసు, నిఘా వర్గాలకు చిక్కకుండా, ‘తమ వారికి’మినహా మిగిలిన వారికి కనిపించకుండా ఉగ్రమూకలు ‘డార్క్‌ నెట్‌’ను వినియో గిస్తున్నాయి. దీనికోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరే టింగ్‌ సిస్టంను ఇన్‌స్టల్‌ చేసుకుంటారు. దీంతోపాటే టోర్స్‌ అనే ఆపరేటింగ్‌ సిస్టం సైతం ఆటోమాటిగ్గా ఇన్‌స్టల్‌ అయిపోతుంది. వీటిని తమ సెల్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్స్‌లో ఇన్‌స్టల్‌ చేసుకున్న జేకే బీహెచ్‌ ఉగ్రవాదులు సమాచారమార్పిడి చేసుకున్నారు. ‘డార్క్‌ నెట్‌’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునా మాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు.

Advertisement
Advertisement