అనాథ బాలల మధ్య బర్త్‌డే

2 Dec, 2015 00:44 IST|Sakshi
అనాథ బాలల మధ్య బర్త్‌డే

సికింద్రాబాద్: టీపీసీసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, మాజీ కార్పోరేటర్ ఆదం ఉమాదేవి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆదం అభిమానులు ఆమె నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతాఫల్‌మండిలోని రెయిన్‌బో అనాథ ఆశ్రమానికి వెళ్లిన ఆదం ఉమాదేవి, పీసీసీ నాయకుడు ఆదం సంతోష్‌కుమార్‌లు అక్కడి చిన్నారులకు అన్నదానం చేశారు.

అనాధ బాలల మధ్య ఉమాదేవి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదం కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని చెప్పారు. భవిష్యత్తులో సైతం సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు