Sakshi News home page

తప్పులు మీవి.. శిక్ష మాకా?

Published Tue, Apr 25 2017 3:20 AM

తప్పులు మీవి.. శిక్ష మాకా?

- డీజీపీ కార్యాలయంలో 50 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన
- దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు తప్పిదాలు చేశారంటూ ఆరోపణ
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న బోర్డు..
- మరి మా పరిస్థితి ఏంటి అంటే పట్టించుకోవట్లేదు: అభ్యర్థులు


సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖ జరిపిన కానిస్టేబుల్‌ నియామకాల్లో జిల్లాల్లోని అధికారులు చేసిన తప్పులతో తాము నష్టపోయా మని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. దేహదారుఢ్య పరీక్ష సమయంలో లాంగ్‌ జంప్‌ విభాగంలో అన్ని జిల్లాల్లో 2.50 మీటర్లు పెడితే నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 2.60 మీటర్లు పెట్టి తమకు అన్యాయం చేశారని 50 మంది అభ్యర్థులు సోమవారం డీజీపీ కార్యాలయంలో ఆందో ళన చేశారు. ఇలా చేయడం వల్ల 100 మందికి పైగా అన్యాయం జరిగిందని అభ్యర్థులు చెప్పారు. దీనిపై రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధి కారులను సంప్రదిస్తే.. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు.

మరి నష్టపోయిన తమ సంగ తేంటని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్ప కుండా పంపించారన్నారు. రంగారెడ్డి, సైబరాబాద్‌ యూనిట్లలో వేర్వేరు కటాఫ్‌ మార్కులు పెట్టాల్సి ఉండగా, ఒకేవిధంగా కటాఫ్‌ పెట్టి అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతీ జిల్లాకు, ప్రతీ పోస్టుకు ఒక్కో రకమైన కటాఫ్‌ మార్కులు పెట్టినప్పుడు ఈ 2 యూనిట్లలో ఒకే రకమైన కటాఫ్‌ పెట్టడం వెనుక ఆంతర్యమేంటని అధికారులను ప్రశ్నించారు.

అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు..
► ఎస్‌సీసీ రిజర్వేషన్‌లో ‘సీ’ సర్టిఫికేట్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ‘ఏ’ సర్టిఫి కేట్‌ ఉన్న అభ్యర్థులకు రిజర్వేçషన్‌ అమలు చేశారు.
► డ్రైవింగ్‌ లైసెన్స్‌పై టెస్ట్‌ పెట్టకుండా ఎం పిక చేశారు. తీరా విచారణ సమయంలో వందల మంది ఫెయిల్‌ అయ్యారు. దీంతో పలువురికి అన్యాయం జరిగింది.
► కేవలం హెవీ లైసెన్స్‌ ఉన్న వారికి 3 లేదా 6 మార్కులు కలపాల్సింది పోయి, టూ వీల ర్‌ లైసెన్స్‌ ఉన్న వారికీ మార్కులు కలిపారు.
► ఓపెన్‌ కోటాలో 40 శాతం మార్కులు దాటని వారిని ఏ రిజర్వేషన్‌ పద్ధతిన ఎంపిక చేశారో చెప్పాలి.
► సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ నియామకాల్లో కేవలం 50 శాతం లోపే రిజర్వేషన్ల అమలు ఉండాలి. దీనికి భిన్నంగా పోలీస్‌ శాఖ 50 శాతం కంటే ఎక్కువగా రిజ ర్వేషన్లు కల్పించి ఎంపిక చేసింది.
► నల్లగొండ జిల్లాలో ఏజెన్సీ కోటా లేకున్నా ఏబీవో ఎస్టీ కోటా కింద కొంత మంది అభ్యర్థులను ఎంపిక చేయడం ఎలా సాధ్యం. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రమే ఏబీవో ఎస్టీ కోటా ఉన్న విషయం బోర్డు అధికారులు మరిచిపోయారు.
► నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికంటే హోంగార్డులకు రిజర్వేషన్‌ ఎక్కువగా ఇచ్చి రిక్రూట్‌ చేశారు.
► ఒక నియామకంలో వెయ్యికి పైగా బ్యాక్‌లాగ్‌ పోస్టుల పెట్టే పరిస్థితి ఎందుకు తెచ్చారో చెప్పాలి.

తీర్పు వచ్చే వరకు శిక్షణ ఆపాలి
తమకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకునేందుకు వస్తే బోర్డు అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని అభ్యర్థులు ఆందోళన చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న శిక్షణ కార్యక్రమాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. తమ కేసుల్లో హైకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు వేచిచూడాలని బోర్డు చైర్మన్‌ పూర్ణచందర్‌రావు ఎదుట అభ్యర్థులు నిరసన తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement