చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ | Sakshi
Sakshi News home page

చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్

Published Wed, Jan 27 2016 2:14 PM

arrest warrant issued to ghmc commissioner chief secretory

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ చీఫ్ సెక్రటరీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. చందానగర్లోని రాజేంద్రరెడ్డి పార్క్ స్థలాన్ని కొందరు మంత్రి అనుచరులు  కబ్జా చేస్తున్నారని కసిరెడ్డి బాస్కర్రెడ్డి గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు చీఫ్ సెక్రటరీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. విచారణకు రాకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని భావించిన చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
 

Advertisement
Advertisement