కొంతే.. ర్యాంకులు అంతంతే! | Sakshi
Sakshi News home page

కొంతే.. ర్యాంకులు అంతంతే!

Published Thu, Sep 7 2017 12:44 AM

కొంతే.. ర్యాంకులు అంతంతే!

- టైమ్స్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత యూనివర్సిటీల వెనుకబాటు
- గతేడాది ర్యాంకింగ్‌లో 201250 మధ్య ఉన్న ఐఐఎస్సీ
- ఈసారి 250300 ర్యాంకింగ్‌కు పడిపోయిన వైనం
- 8011000 మధ్యలో ఓయూ, ఎస్వీ, ఆంధ్రా యూనివర్సిటీలు
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచస్థాయి యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనుకబడ్డాయి. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ 2018 వివరాలను బుధవారం ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, విదేశీ విద్యార్థుల శాతం, బాల, బాలికల నిష్పత్తి, బోధన, పరిశోధన, ఇంటర్నేషనల్‌ ఔట్‌లుక్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్‌ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్‌ ప్రకారం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకులివ్వగా మన దేశంలోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది.

గతేడాది బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు 201250 మధ్య స్థానంలో నిలవగా, ఈసారి 250300 మధ్య ర్యాంకుకు పడిపోయింది. ఇక గతేడాది లాగే ఉస్మానియా యూనివర్సిటీ ఈసారి 8011000 మధ్య స్థానంలో ఉండిపోయింది. ఏపీలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ గతేడాది ర్యాకింగ్‌లో 601800 మధ్య స్థానంలో ఉండగా, ఈసారి 8011000 స్థానంలోకి పడిపోయింది. గతేడాది ఆంధ్రా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ 800 పైగా స్థానంలో ఉండగా, ఈసారి ఆంధ్రా యూనివర్సిటీ 8011000 స్థానంతో తన ర్యాంకును పదిలపరుచుకోగా, నాగార్జున యూనివర్సిటీ మాత్రం ఆ ర్యాంకును నిలబెట్టుకోలేకపోయింది. గతేడాది టాప్‌ 800లోపు 19 విద్యా సంస్థలు ర్యాంకింగ్‌ పొందగా, ఈసారి 17 విద్యా సంస్థలే ఉన్నాయి.

Advertisement
Advertisement