'అర్థరాత్రిలోపు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం' | Sakshi
Sakshi News home page

'అర్థరాత్రిలోపు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం'

Published Thu, Sep 15 2016 5:38 PM

'అర్థరాత్రిలోపు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం'

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అనురాగ శర్మ పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం అనుకున్న టైంలోనే పూర్తి చేశామని చెప్పారు. బాలాపూర్‌ గణేష్‌ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అర్థరాత్రి లోపు బాలాపూర్‌ గణనాథుడిని నిమజ్జనం చేస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా, వినాయక నిమజ్జనాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్‌ సర్వేలో నాయిని వెంట డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. 

ఇదిలా ఉండగా, ఖైరతాబాద్‌ వినాయకుని నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగింది. 6 గంటల్లో ఖైరతాబాద్‌ గణేషుడి నిమజ్జనం రికార్డు సమయంలో పూర్తి అయింది. బాలాపూర్‌ గణేష్‌ శోభాయత్ర ఇంకా కొనసాగుతోంది. చార్మినర్‌ మీదుగా బాలాపూర్‌ గణేషుడి శోభాయాత్ర ఎమ్‌జే మార్కెట్‌ వైపుగా కొనసాగుతోంది. అయితే ఈసారి బాలాపూర్‌ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో బాలాపూర్‌ లడ్డూ రూ. 14.65 లక్షలు పలికింది. గతంలో కంటే రూ. 4.33 లక్షలు ఎక్కువ పలికింది. వేలం పాటలో బడంగ్‌పేట గణేష్‌ లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. 

Advertisement
Advertisement