పోలీస్ కస్టడీకి నందిని | Sakshi
Sakshi News home page

పోలీస్ కస్టడీకి నందిని

Published Mon, Nov 9 2015 9:32 AM

పోలీస్ కస్టడీకి నందిని

హైదరాబాద్: చీటింగ్ కేసులో ప్రముఖ బ్యూటీషియన్, బ్లష్ లగ్జరీ స్పా అండ్ సెలూన్ యజమానురాలు యలమంచిలి నందిని చౌదరి(29)ని జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు.  గతనెల 29న ఆమెను రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మరింత సమాచారంతో పాటు ఆభరణాల ఆచూకీ తెలుసుకునేందుకు తిరిగి కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం సోమవారం ఉదయం ఆమెను తిరిగి రిమాండ్‌కు తరలించనున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... ఫిలింనగర్‌లో నందిని చౌదరి బ్లష్ స్పా అండ్ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు.  బ్యూటీపార్లర్ నిర్వహించడంతో పాటు  నగల వ్యాపారం కూడా చేస్తోంది.  తన స్పాకు వచ్చే ఖరీదైన మహిళలకు ఈ ఆభరణాలు చూపించి విక్రయిస్తుంటోంది. ఇందులో భాగంగానే హుస్సేనిఆలంలో ఉండే ఆభరణాల వ్యాపారి సోమెన్‌ఘోష్ నుంచి మొత్తం రూ. 50 లక్షల విలువైన 5 నెక్లెస్‌లను అమ్మి పెడతానని తీసుకుంది.

వాటిని విక్రయించకుండా వేరే వారి వద్ద కుదవపెట్టి మోసం చేసింది. దీంతో బాధితుడు తనను నందినిచౌదరి మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506ల కింద కేసులు నమోదు చేసి ఆమెను రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement
Advertisement