అందమే ఆనందం | Sakshi
Sakshi News home page

అందమే ఆనందం

Published Mon, Jan 19 2015 12:18 AM

అందమే ఆనందం

అందం.. అంతకు మించిన ఆత్మవిశ్వాసం.. కలగలసిన యువతులు ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా 2015 ఆడిషన్స్‌లో తళుక్కుమన్నారు. ర్యాంప్‌పై తొణకకుండా హొయలొలికించిన మెరుపు తీగలు.. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు కాన్ఫిడెంట్‌గా సమాధానాలిచ్చారు. మిస్ ఇండియా రేస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఆడిషన్స్‌లో మొదటి నాలుగు స్థానాలు గెలుచుకున్న జార షా, హారిక, ప్రతిభ, సుకృతి తమ ఆనందాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
  వాంకె శ్రీనివాస్
 
మాటల్లో చెప్పలేను...    
బ్యూటీ అంటే ప్రాణం. అందంగా కనిపించాలనుకునే దాన్ని. 2008లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ కిరీటాన్ని దక్కించుకున్నా. అదే నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అవకాశాన్ని అందించింది. అందులో అందంగా కనిపించే క్యారెక్టర్ చేశాను. సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అందంపై నాకున్న ఆసక్తి మళ్లీ మిస్ ఇండియా పోటీల వైపు నడిపించింది. బెంగళూర్‌లో జరిగే తర్వాతి పోటీలకు అర్హత సాధించడం ఆనందంగా ఉంది. ఎగిరి గంతేయాలనిపిస్తోంది.
 - జారా షా, మొదటి స్థానం
 
ఇదే తొలిసారి...
పాఠశాల స్థాయిలో చిన్న చిన్న ఈవెంట్లలో పాల్గొనేదాన్ని. ఫేమ్ అయిన పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ పోటీకి ముందు అనుభవమున్న మోడల్స్‌తో మనం పోటీ పడగలమా అనిపించింది. నాలో ఆత్మవిశ్వాసమే నన్ను ర్యాంప్‌పై నడిపించింది. బ్యూటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ విజయాన్ని అందుకునేలా చేసింది. నారాయణగూడలోని భవన్స్ కాలేజ్‌లో బీకామ్ చదువుతున్నాను.
 - హారిక, రెండో స్థానం
 
ఆ హాబీనే ఇలా...
మాది దిల్లీ. మూడేళ్ల కిందట సిటీకి వచ్చాను. ప్రస్తుతం ఫిజ్జి కాలేజీలో పన్నెండో తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అందంగా ముస్తాబయ్యేదాన్ని. అదే నన్ను ఈ రోజు ఈ పోటీల్లో పాల్గొనేలా చేసింది. పేరెంట్స్ ప్రోత్సాహంతో ఇంత వరకూ రాగలిగాను.
 - ప్రతిభ, మూడో స్థానం
 
్చకిరీటం ఇవ్వు స్వామీ...
మా సొంతూరు దిల్లీ. ఎంబీఏ కోసం గతేడాది సిటీకి వచ్చాను. దేవుడు ప్రత్యక్షమై ‘నారీ ఏమి నీ కోరిక’ అంటే.. ప్రపంచ సుందరి కిరీటం ఇవ్వమంటాను. బ్యూటీ పై నాకు అంత పిచ్చి. అందంతోపాటు కాస్త తెలివితేటలు ఉంటే మిస్ ఇండియా పోటీల్లో దూసుకుపోవచ్చు. మిస్ ఇండియా కిరీటం గెలుస్తాననే నమ్మకం ఉంది.
 - సుకృతి, నాలుగో స్థానం

Advertisement
Advertisement