'ఆర్థిక చోదక శక్తిగా గృహరంగం' | Sakshi
Sakshi News home page

'ఆర్థిక చోదక శక్తిగా గృహరంగం'

Published Thu, Mar 10 2016 1:46 PM

budget speech by yanamala ramakrishnudu in assembly

హైదరాబాద్: రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం కీలక ఆర్థిక చోదకశక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 2022నాటికి అందరికీ గృహ సదుపాయం కల్పించే లక్ష్యానికి కట్టుబడివున్నామని చెప్పారు. 2016-17లో రూ.429.97 కోట్లతో 860 కిలోమీటర్ల మేర తారురోడ్ల నిర్మాణం, రూ.10 కోట్లతో రహదారి భద్రతానిధి ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు.

సాంకేతిక, కళాశాల, ఉన్నత విద్యల అభివృద్ధి కోసం ఈ ఏడాది రూ.2,644.64 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బలహీన వర్గాలకు 1,20,106 గృహాలు వచ్చాయని, ఇప్పటికే 73,041 గృహాలకు అనుమతిచ్చిందని చెప్పారు. విశాఖపట్టణంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతిలో శ్రీ పద్మావతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రారంభించామని రూ.10,623 కోట్ల అంచనా వ్యయంతో 59 పట్టణ, స్థానిక సంస్థల్లో 110 గృహ నిర్మాణ పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల గృహనిర్మాణంపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు.

గృహనిర్మాణరంగానికి రూ.1132.83 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.6,103.76 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మానవాభివృద్ధి సూచికల్ని పెంపొందించడానికి కట్టుబడివున్నామన్నారు. సెకండరీ విద్యకు రూ.17,502 కోట్లు, సమగ్ర శిశు అభివద్ధి పథకం  (ఐసీడీఎస్) లో భాగంగా 26.45 లక్షల మంది పిల్లలకు, 8.56 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు అదనపు పౌష్టికాహార కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి కోసం రూ.2,644.64 కోట్లు , ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2702.20 కోట్లు వ్యయం చేయనున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపర్చి లోటుపాట్లను చక్కదిద్దాలని సంకల్పించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement