ఇంట్లో మద్యం తాగొద్దన్నందుకు.. | Sakshi
Sakshi News home page

ఇంట్లో మద్యం తాగొద్దన్నందుకు..

Published Tue, Mar 7 2017 2:20 PM

car catches fire in langar house

హైదరాబాద్‌: ఇంట్లో మద్యం తాగవద్దని యజమాని చెప్పినందుకు అద్దెకు ఉండే యువకులు అతని కారును తగులబెట్టారు. ఈ ఘటన లంగర్‌హౌజ్‌లో జరిగింది. పద్మారావు అనే వ్యక్తి ఇంట్లో నలుగురు వ్యక్తులు అద్దెకు ఉంటున్నారు. ఇంటి ఆవరణలోనే వారు రోజూ మద్యం తాగి న్యూసెన్స్‌ సృష్టిస్తున్నారు. అలా చేయవద్దని ఇంటి యజమాని పదేపదే చెప్పినా వారు తీరుమార్చుకోలేదు. గట్టిగా నిలదీయగా పద్మారావు ఇంటి ఆవరణలో పార్కు చేసిన కారును సోమవారం రాత్రి తగులబెట్టారు. దీనిపై బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement