ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై అదుపుతప్పిన కారు | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై అదుపుతప్పిన కారు

Published Sun, Mar 1 2015 10:29 AM

Car halchal at Khairatabad Flyover

 హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలోని ఖైరతాబాద్ ఫై్లఓవర్‌పై వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి హోండా ఆక్టీవ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సాత్విక్ రెడ్డికి గాయాల య్యాయి. ఆదివారం ఉదయం ఫ్లై ఓవర్ పైనుంచి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆతర్వాత డివైడర్‌ను ఢీకొని ఆగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన సాత్విక్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం చిరుజల్లులు పడటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.

 

Advertisement
Advertisement