అదనంగా వసూలు చేస్తే చర్యలే.. | Sakshi
Sakshi News home page

అదనంగా వసూలు చేస్తే చర్యలే..

Published Thu, May 25 2017 12:10 AM

అదనంగా వసూలు చేస్తే చర్యలే..

- అవసరమైతే ఈసేవా కేంద్రం రద్దు చేస్తాం..
- డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం వివరాల నమోదు ఫీజుపై సీజీజీ స్పష్టీకరణ
- రూ.20కి మించి తీసుకుంటే 1100కు ఫిర్యాదు చేయాలని సూచన
- దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకటాచలం వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా ఈసేవా/మీసేవా కేంద్రాల్లో ఆధార్, బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేసుకునే విద్యార్థుల నుంచి ప్రాసెస్‌ ఫీజు కింద రూ.20కు మించి వసూ లు చేయడానికి వీల్లేదని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నె న్స్‌(సీజీజీ) స్పష్టం చేసింది. ఈసేవా/ మీ సేవా కేం ద్రాల్లో విద్యార్థుల నుంచి ప్రాసెస్‌ ఫీజు కింద రూ. 50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు అందాయి. విషయాన్ని ఉన్నత విద్యా మండలి అధికారులు సీజీజీకి తెలియజేశారు. ప్రాసెస్‌ ఫీజు రూ.20కి మించి వసూలు చేయడానికి వీల్లేదని, ఏదైనా కేం ద్రం వారు అంతకుమించి వసూలు చేస్తే 1100 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిం చారు. అవసరమైతే ఆ ఈసేవా/మీసేవా కేంద్రాన్ని రద్దు చేస్తామని సీజీజీ అధికారులు తెలిపారు.

24 ప్రభుత్వ కాలేజీల్లోని హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లోనూ విద్యార్థులు బుధవారం నుంచి ఉచితంగా ప్రాసెస్‌ చేసుకునేలా చర్యలు చేపట్టామని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీ సెస్‌ తెలంగాణ (దోస్త్‌) ప్రవేశాల కన్వీనర్‌ ప్రొ. వెంకటాచలం చెప్పారు. వాటిలో బయోమెట్రిక్‌ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. 14 కాలే జీలు కోర్టును ఆశ్రయించాయని, వాటిలో మాత్రం యాజమాన్యాలే ప్రవేశాలు చేపట్టుకుంటాయని తెలిపారు. తాము ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ చేసే 24 హెల్ప్‌ లైన్‌ కేంద్రాల వివరాలను దోస్త్‌ వెబ్‌ సైట్‌లో పొంద వచ్చన్నారు. మరో 22 కాలేజీలు ఆన్‌లైన్‌ ప్రవేశాల జాబితాలో ఉన్నా, అవి కూడా సొంతంగా ప్రవేశా లు చేపట్టుకునేందుకు కోర్టును ఆశ్రయించాయని, వాటిలో ప్రవేశాలు కోర్టు తీర్పునకు లోబడి ఉంటా యన్నారు. ఆ కాలేజీల వివరా లను చూసుకొని ఆప్షన్లు ఇచ్చుకో వాలన్నారు. వర్సిటీల్లోని హెల్ప్‌లైన్‌ కేంద్రా ల్లో ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు.

దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ..
విద్యార్థులు మొదట దోస్త్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌ లైన్‌ ద్వారా రూ.100 చెల్లించాలి. వారి మొబైల్‌కు దోస్త్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది. ఆ తర్వాత ఈసేవా/ మీసేవా/24 హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లి ఆధార్, బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేయించు కోవాలి. నమోదు తర్వాత అక్కడ దోస్త్‌ టోకన్‌ నం బరు ఇస్తారు. ఆ సమీపంలోని వర్సిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత దోస్త్‌ యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్, టోకన్‌ నంబరును ఉప యోగించి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

Advertisement
Advertisement