పవన్‌పై వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

పవన్‌పై వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు

Published Fri, Sep 9 2016 6:33 PM

పవన్‌పై వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు - Sakshi

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో స్పందించారు. సమావేశంలో ఈ అంశంపై చర్చ వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. ఇచ్చిన ప్యాకేజిని వద్దంటే ఎలాగని.. ప్యాకేజిని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం సబబా అని నేతలను చంద్రబాబు ప్రశ్నించారు.

పవన్ ఆవేదనను తాము అర్థం చేసుకుంటామని, ఆయన ఏమైన మాట్లాడుకోనివ్వండి గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్ల పసిపాప అని ఆయన చెప్పారు. పవన్ ఏం మాట్లాడినా మన ఇబ్బందులు మనకున్నాయని తెలిపారు. పవన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన చెప్పారు.

Advertisement
Advertisement