చంద్రబాబు ఓఎస్డీ అభీష్టపై పార్టీలో చర్చ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓఎస్డీ అభీష్టపై పార్టీలో చర్చ

Published Sat, Dec 26 2015 1:26 PM

చంద్రబాబు ఓఎస్డీ అభీష్టపై పార్టీలో చర్చ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఓఎస్డీ సీతేపల్లి అభీష్టపై టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.  ఓఎస్డీగా అభీష్ట రాజీనామా చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన సచివాలయానికి రాకపోవడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది. అభిష్ట...ఐఏఎస్ అధికారుల పట్ల అమర్యాద వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

చంద్రబాబు తనయుడు లోకేశ్కు సన్నిహితుడు అయినందునే ఆయనకు ఓఎస్డీ పదవి కట్టబెట్టినట్లు గతంలో విమర్శలు వచ్చాయి. అయితే ఆ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఓఎస్డీగా అభిష్టను ప్రభుత్వమే నియమించిందని వివరణ కూడా ఇచ్చింది. గతంలో చినబాబు ఆదేశాలతో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అభిష్ట సర్వేలు చేయించారు. అయితే తనకు అనుకూలంగా ఉన్నవారికి ఒకతీరుగా, మిగతావారికి వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement