googletag.pubads().enableSingleRequest(); //googletag.pubads().disableInitialLoad(); googletag.pubads().collapseEmptyDivs(true,true); googletag.enableServices(); }); క్రైస్తవులు ప్రపంచ శాంతి కాముకులు | Sakshi
Sakshi News home page

క్రైస్తవులు ప్రపంచ శాంతి కాముకులు

Published Sun, Dec 11 2016 4:00 AM

క్రైస్తవులు ప్రపంచ శాంతి కాముకులు - Sakshi

క్రైస్తవ సంఘాల మహాసభలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రపంచ శాంతి కోసం క్రైస్తవ సోదరులు పాటుపడతారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మహాసభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధికి రాష్ట్రం బాగుండాలని కోరుకునే గొప్ప స్ఫూర్తిదాయకమైన వారు క్రైస్తవులని కొనియాడారు. దేశంలో ఎన్నో రకాల మతాలు, వర్గాలు ఉన్నా దేశాభివృద్ధికి పాటుపడడంతో పాటు తన ధర్మాన్ని పాటించడమే నిజమైన లౌకికవాదమని సీఎం కేసీఆర్‌ గతంలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు. క్రైస్తవ సోదరులకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా పేద క్రైస్తవులకు తమ ప్రభుత్వం వస్త్రాలు అందజేస్తోందన్నారు.

క్రైస్తవ భవనం కోసం మహేంద్రహిల్స్‌లో స్థలం కేటాయిం చినç ప్పటికీ కోర్టు కేసులో ఉన్నందున భవన నిర్మాణా నికి నిధులు కేటాయించ లేకపోయామని మరోచోట స్థలం కేటాయిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోం మంత్రి  నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు తలసాని, పద్మారావు, మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement