చరిత్రాత్మకం.. అపూర్వం | Sakshi
Sakshi News home page

చరిత్రాత్మకం.. అపూర్వం

Published Wed, Aug 20 2014 11:54 PM

చరిత్రాత్మకం..  అపూర్వం

సిటీ అందాలపై కొరియన్ల మాట
 
విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ ముగిసింది. అందరూ పునశ్ఛరణలో.. గతంలో జరిగిన విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌కి, దీనికి వ్యత్యాసాలు, మంచిచెడులు బేరీజువేసుకొనే పనిలోపడ్డారు. అంతేకాదు నగర అందాలను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తూ కనిపించారు. అలా కనిపించిందే ఈ కొరియన్ జంట. పేర్లు.. ఉన్ షిల్ కిమ్, జియన్ రో. ‘హైదరాబాద్‌లో చరిత్రాత్మక కట్టడాల గురించి విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చిందని’ నగర విశిష్టతను వీరు కొనియాడారు. ఉన్ షిల్ కిమ్... సియోల్‌లోని ఇవా ఉమన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్. కొరియన్ విమెన్స్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ కూడా. జియన్ రో అదే యూనివర్సిటీలో ఏషియన్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ సీనియర్ కోఆర్డినేటర్. 2005లో జరిగిన విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌కి కొరియానే ఆతిథ్యమిచ్చింది. ఆ సదస్సులో ఉన్ షిల్ కిమ్, జియన్ రోలు ఇద్దరూ కీలకపాత్ర పోషించారు.

ఇండియన్ విమెన్ ఆర్ పవర్‌ఫుల్

నాటి సదస్సు నేటి సదస్సుకు ఉన్న తేడాలను వివరించింది ఉన్ షిల్ కిమ్...‘1981 నుంచి ఇప్పటిదాకా జరిగిన విమెన్స్ కాంగ్రెస్‌లన్నిటిలోకి కొరియాలో జరిగిందే పెద్దది. 75 దేశాల నుంచి మూడువేల మంది డెలిగేట్స్ వచ్చారు. ‘ఎంబ్రేసింగ్ ద ఎర్త్.. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్’  మా కాంగ్రెస్ థీమ్. ప్రపంచంలోని అభివృద్ధి, వెనుకబాటు ఉన్న మహిళలను ఒక్క దగ్గరికి చేర్చి ఐక్యం చేయాలన్నదే ఆ కాంగ్రెస్ లక్ష్యం. అంతలా విజయవంతమవడానికి వచ్చిన ఫెమినిస్టులు, రైటర్స్,ఉపన్యాసకులు, మహిళలకు సంబంధించి కృషిచేస్తున్న ఎన్‌జీవోలూ కారణం. అలాంటిదే నేను ఇక్కడా ఎక్స్‌పెక్ట్ చేశా. వెరీ బ్యాడ్ అండ్ శాడ్! ఆ స్పిరిటే కనిపించలేదు. బయటి నుంచి వచ్చిన వాళ్లు తప్ప లోకల్ రిప్రజెంటేషనే లేదు. ఇండియన్ విమెన్ ఆర్ వెరీ పవర్‌ఫుల్ విమెన్. ఎంతలా అంటే వరల్డ్
 సినారియోనే చేంజ్ చేయగలిగేంత! మంచి శక్తియుక్తులున్న ఇండియన్ విమెన్‌కి ఇలాంటి సదస్సు మంచి స్పేస్‌నిస్తాయి. వరల్డ్ విమెన్‌తో ఇంటరాక్ట్ అయ్యే చాన్స్ వస్తుందికదా.. దీన్ని ఉపయోగించుకోవాలి’’ అన్నది.

గ్రేట్ హైదరాబాద్

హైదరాబాద్ గురించి జియన్ రో మాట్లాడుతూ.. ‘ఉన్ ఇండియాకు చాలాసార్లు వచ్చింది కానీ నేను రావడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే హైదరాబాద్ విజిట్ ఇద్దరికీ ఫస్ట్‌టైమే. గ్రేట్.. చాలా బాగుంది. ఇక్కడి చారిత్రక కట్టడాల గురించి వినడమే.. ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది. ఫుడ్, కల్చర్ అన్నీ నచ్చాయ్. వి ఆర్ ఎంజాయింగ్ లాట్’ అని చెప్పింది!  
 
 

Advertisement
Advertisement