వేగంగా ‘భవనాల’ పంపిణీ | Sakshi
Sakshi News home page

వేగంగా ‘భవనాల’ పంపిణీ

Published Mon, Feb 13 2017 3:12 AM

వేగంగా ‘భవనాల’ పంపిణీ - Sakshi

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి
రాజ్‌భవన్‌లో గంటన్నర సేపు భేటీ
ఏపీ సచివాలయం అప్పగింత తదితరాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న భవనాలు, కార్యాలయాల పంపిణీని వేగంగా పూర్తి చేయా లని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం గంటన్నరకు పైగా గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. రెండు రోజులపాటు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సీఎం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

వచ్చీ రాగానే గవర్నర్‌తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ సచివాలయ భవనాల అప్పగింత, విభజన వివాదాల పరిష్కా రానికి రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీల విధివిధానాలు, బడ్జెట్‌ సమావేశాలు, కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేసిన అంశాలపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. గవర్నర్‌ సారథ్యంలో రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఇప్పటికే రెండుసార్లు సమావేశమ య్యాయి. సచివాలయం లోని ఏపీ భవనాలను అప్ప గించాలని కోరుతూ తెలం గాణ ప్రభుత్వం తీర్మానం చేసి రెండు నెలల కిందటే గవర్నర్‌కు పంపించింది. భవనాలను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ బదులుగా తమకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌తోపాటు ఖాళీ స్థలాన్ని కేటాయించా లనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

అయితే త్రిసభ్య కమిటీ రెండు దఫా లుగా జరిపిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత రాలేదు. తమ ముఖ్యమంత్రితో మాట్లాడి చెబు తామంటూ మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు సార థ్యంలోని త్రిసభ్య కమిటీ ఈ అంశాన్ని పెండిం గ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ మహి ళా పార్లమెంట్‌ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లిన గవర్నర్‌.. ఏపీ సీఎం చంద్రబాబుతో ఈ అంశాన్ని చర్చించినట్లు తెలిసింది. మరుసటి రోజునే సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో భేటీ కావడంతో భవనాల అప్పగింతపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

మార్చి మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్‌ సమావేశాలు..
రాబోయే బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్చించి నట్లు తెలిసింది. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement