ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్ | Sakshi
Sakshi News home page

ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్

Published Wed, Jul 29 2015 6:06 PM

ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చిన కేసీఆర్ - Sakshi

హైదరాబాద్: పినతల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలపాలై కోలుకున్న ప్రత్యూష బాగా చదువుకుని పైకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. బుధవారం తన ఇంటికి వచ్చిన ప్రత్యూషతో కేసీఆర్ మాట్లాడారు. 'నువ్వు కష్టపడి చదివి పైకి రావడమే, నిన్ను బాధ పెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష' అని కేసీఆర్ అన్నారు.

అన్నింటికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఎప్పుడైనా రావొచ్చంటూ ప్రత్యూషకు ఫోన్ నంబర్ ఇచ్చారు. ప్రత్యూష చదువు, వసతి, ఇతర విషయాలు ప్రభుత్వమే చూసుకుంటుందని హామీయిచ్చారు. ఆమె కోసం రూ. 5 లక్షలు మంజూరు చేశారు.

Advertisement
Advertisement