ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలి | Sakshi
Sakshi News home page

ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలి

Published Sat, Apr 16 2016 1:12 AM

ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలి - Sakshi

♦ వ్యవసాయాధికారులు,కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం
♦ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్
 
 సాక్షి, హైదరాబాద్:
నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలని, జూన్‌లోగా నీటి కుంటల తవ్వకాన్ని ఉద్ధృతం చేయాలని కలెక్టర్లు, వ్యవసాయాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. కలెక్టర్లు, వ్యవసాయాధికారులు, వ్యవసాయ అనుబంధ రంగాల ముఖ్యులతో శుక్రవారం విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వివిధ సూచనలు, సలహాలు ఇచ్చారు. నీరు-చెట్టు కార్యక్రమం అమలు తీరును అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

 రేపటి నుంచి రైతు సదస్సులు
 ఖరీఫ్ ప్రణాళిక అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి రైతు అవగాహన సదస్సులు జరగనున్నాయి. కేంద్రం సూచన మేరకు వీటిని నిర్వహించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సుల్లో పంటల బీమా, భూసార పరీక్షల నమోదు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సేంద్రియ వ్యవసాయం, పంట సంజీవని, తదితర అంశాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement