'విద్యాహక్కు చట్టాన్ని సీఎం విస్మరిస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'విద్యాహక్కు చట్టాన్ని సీఎం విస్మరిస్తున్నారు'

Published Thu, Apr 21 2016 3:35 PM

'విద్యాహక్కు చట్టాన్ని సీఎం విస్మరిస్తున్నారు' - Sakshi

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు విద్యాహక్కు చట్టాన్ని విస్మరిస్తున్నారని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి విద్యారంగం నిధుల వ్యయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం చివరి స్థానంలో ఉండటమే నిదర్శనమన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం ఆ చట్టాన్ని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 390 స్కూళ్లలో అడ్మిషన్ లేకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గత ఏడాదిలో 410 కాలేజీలు మూతపడగా 46 వేల సీట్లు తగ్గాయని.. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఉన్నత విద్యను గాడిలో పెట్టాలని షబ్బీర్ అలీ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement