నిమ్స్‌కు సుస్తీ | Sakshi
Sakshi News home page

నిమ్స్‌కు సుస్తీ

Published Tue, Mar 4 2014 4:14 AM

నిమ్స్‌కు సుస్తీ - Sakshi

  •      న్యూరో, యూరో విభాగంలో పేషెంట్ల పడిగాపులు
  •      సీటీసర్జరీ, స్పైన్ విభాగాల్లో పని చేయని యంత్రాలు
  •      మృత్యువాత పడుతున్న క్షతగాత్రులు, హృద్రోగులు
  •  సాక్షి, సిటీబ్యూరో : మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.వెంకటయ్య ప్రమాదవశాత్తూ నిద్రలో మంచంపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతి ంది. చికిత్స కోసం రెండు రోజుల క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో సియరమ్ పరికరం పనిచేయడం లేదని, శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేయడంతో మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

    గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శౌరిని చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సీటీ సర్జరీ(కార్డియో థొరాసిక్) విభాగంలో ఛాతీపై కోత కోసే ఓ చిన్న యంత్రం పాడైపోవడంతో సకాలంలో చికిత్స అందక ఆయన ఇటీవల నిమ్స్ ముందే మృతి చెందారు. చిన్నచిన్న వైద్య పరికరాలు పని చేయడం లేదనే సాకుతో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు, హృద్రోగులకు చికిత్సకు నిరాకరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
     
    కోమాలో స్పైన్ విభాగం

    సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. వీరి లో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెల రోజుల క్రితం పాడైపోయింది. రిపేరు చేయించే అవకాశం ఉన్నా సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్యపరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు.
     
    యూరో, న్యూరో సేవల్లో తీవ్ర జాప్యం
     
    ఇక తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధపడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూ డా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తుండటం తో వీరంతా నిమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీ చేయించుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. హృద్రోగులకు సర్జరీ చేసే సీటీ విభాగంలో ఛాతీపై కోత కోసే మిషన్ పనిచేయక పోవడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్జరీ చేయక పోవడంతో హృద్రోగంతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగాలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేక పోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఇక్కడ రోగులకు పడకలు కూడా దొరకడం లేదు.
     

Advertisement
Advertisement