విద్యతోనే దేశాభివృద్ధి | Sakshi
Sakshi News home page

విద్యతోనే దేశాభివృద్ధి

Published Mon, Jun 19 2017 2:46 AM

విద్యతోనే దేశాభివృద్ధి - Sakshi

తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య
 
హైదరాబాద్‌: విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పిలుపునిచ్చారు. కాచిగూడలోని వైశ్యహాస్టల్‌ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కా రాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మెరిట్‌ సాధించిన 800 మంది వైశ్య విద్యార్థులకు బంగారు, వెండి పత కాలతోపాటు ప్రోత్సాహక బహుమతులను ఆయన ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రను తిరగరాయగలిగే సత్తా విద్యార్థులపైనే ఉందన్నారు.

ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం మంచి సంప్రదాయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుల సంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. విద్య విజ్ఞా నాన్ని పెంచడంతో పాటు ఉపాధికి మార్గం కావా ల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు సూచిం చారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, బి.గణేశ్‌గుప్త, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ కొలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళావిభాగం డాక్టర్‌ ఉప్పల శారద, అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లికార్జున్, మహిళా విభాగం ప్రధానకార్యదర్శి బొడ్డు తిరుమలేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement