జకీర్‌ను కలిసింది నిజమే : దిగ్విజయ్ | Sakshi
Sakshi News home page

జకీర్‌ను కలిసింది నిజమే : దిగ్విజయ్

Published Sat, Jul 9 2016 3:55 AM

Digvijay comment about Zakir

సాక్షి, హైదరాబాద్ : తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్, దాని జేబు సంస్థలు జకీర్‌నాయక్‌ను అడ్డుపెట్టుకుంటున్నాయని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఇక్కడ శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ జకీర్‌నాయక్‌ను కలవడంతో తప్పేమిటని ప్రశ్నించారు. ‘జకీర్‌నాయక్‌ను నేను కలిస్తే దేశద్రోహిని. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ కలిస్తే దేశభక్తుడా’ అని ప్రశ్నించారు. తన తప్పేమిటో తేల్చడానికి విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలకు భయపడబోనని, వీటికి చింతించాల్సిన అవసరమే లేదన్నారు.2012లో ఓ విందు సందర్భంగా ఆహ్వానిస్తే వెళ్లినట్టుగా చెప్పారు. మహారాష్ట్రలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా... చేతనైతే విచారణ జరిపించుకోవాలన్నారు. ‘పాకిస్తాన్ ప్రజాప్రతినిధులతో ప్రధాని మోదీ మాట్లాడుకుని, విందులు చేసుకోలేదా? హిందూ తీవ్రవాదం ఆరోపణలు ఎదుర్కొం టున్న రవిశంకర్‌తో రాజ్‌నాథ్‌సింగ్ సమావేశం కాలేదా? అంటే రాజ్‌నాథ్‌సింగ్‌కు ఉగ్రవాదులతో సంబంధమున్నట్టేనా’ అని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement