మళ్లింపు జలాలపై చర్చలు | Sakshi
Sakshi News home page

మళ్లింపు జలాలపై చర్చలు

Published Thu, Aug 3 2017 1:49 AM

మళ్లింపు జలాలపై చర్చలు

కృష్ణా బోర్డు చైర్మన్‌తో బజాజ్‌ కమిటీ సమావేశం
ఈ నెలాఖరులో కమిటీ హైదరాబాద్‌ పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: పట్టిసీమ, పోలవరం ద్వారా గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న మళ్లింపు జలాలపై కేంద్ర జల వనరుల శాఖ నియమిం చిన ఏకే బజాజ్‌ కమిటీ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీలో బుధవారం సమావేశం నిర్వహించింది. కేంద్ర జల వన రుల శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్‌పీ పాండే, ప్రదీప్‌ కుమార్‌ శుక్లా, ఎన్‌.ఎన్‌.రాయ్‌తో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శ్రీవాత్సవ భేటీ అయ్యారు. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రా లకు వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించే అంశాలపై చర్చించారు. మళ్లింపు జలాలపై తెలుగు రాష్ట్రాలు వినిపిస్తున్న వాదన లను కృష్ణా బోర్డు చైర్మన్‌ కమిటీ సభ్యులకు వివరించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ.. ఈ నెలాఖరుకు ఇరు రాష్ట్రాల్లో పర్య టించి ఈ అంశాలపై ఓ అవగాహ నకు వస్తామని తెలిపినట్లు సమాచారం.

ప్రవాహ లెక్కలు పక్కాగా..
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేసిన నీటి ప్రవాహాల లెక్కలు టెలీమెట్రీ విధానం ద్వారా కచ్చితంగా తెలుస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేసి అందజేయాలని కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ ఆయా ప్రాజెక్టుల ఈఈలకు సూచించారు.

జూరాలకు 4,400 క్యూసెక్కులు..
కృష్ణా బేసిన్‌ పరిధిలోని ఎగువ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు తగ్గడంతో దిగువకు నీటిప్రవాహం తగ్గింది. నారాయ ణపూర్‌ నుంచి పవర్‌ హౌజ్‌ ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో అందులో 4,400 క్యూసె క్కులు జూరాలకు వస్తోంది. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని జూరాల నుంచి 4,296 క్యూసెక్కుల నీటిని ఆ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా కింద ఉన్న చెరువులకు వదులుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement