దీపావళికి ప్రత్యేక రైళు | Sakshi
Sakshi News home page

దీపావళికి ప్రత్యేక రైళు

Published Wed, Oct 16 2013 5:37 AM

దీపావళికి  ప్రత్యేక రైళు

సాక్షి,సిటీబ్యూరో: దీపావళి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో  తెలిపారు. సికింద్రాబాద్-మచిలీపట్నం, సికింద్రాబాద్-విశాఖపట్టణం,హైదరాబాద్-రేణిగుంట రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి.
 
 స్పెషల్ రైళ్ల వివరాలు.. 
  సికింద్రాబాద్-మచిలీపట్నం (07050/07049) నవంబర్ 3,10 తేదీలలో ఉదయం 10.30కి  సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. అదేరోజు సాయంత్రం 7.30కి  మచిలీపట్నం చేరుకుంటుంది.
 
 - తిరుగు ప్రయాణంలో నవంబర్ 3,10 తేదీలలో రాత్రి 9.30 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.55కి  సికింద్రాబాద్ చేరుకుంటుంది.  కాజీపేట్, వరంగల్, మహబూబ్‌బాద్, ఖమ్మం,విజయవాడ,గుడివాడ,గుడ్లవల్లేరు,కౌతాపురం,పెడన,చిలకలపూడి స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి.
 
  సికింద్రాబాద్-విశాఖపట్టణం (02728/02727) ఏసీ సూపర్‌ఫాస్ట్.. నవంబర్ 1, 8 తేదీలలో రాత్రి 10.10కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. 
 
 - తిరుగు ప్రయాణంలో విశాఖపట్టణం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నవంబర్ 2, 9 తేదీలలో సాయంత్రం 7.05కి విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కి  సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాజీపేట్,వరంగల్, విజయవాడ,ఏలూరు,తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట,అన్నవరం,తుని,అనకాపల్లి,దువ్వాడ స్టేషన్‌లలో ఆగుతాయి.
 
  హైదరాబాద్-రేణిగుంట (07145/07146) సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1,8 తేదీలలో రాత్రి  11.15కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.
 
 - తిరుగు ప్రయాణంలో నవంబర్ 2,9 తేదీలలో మధ్యాహ్నం 2.30కి రేణిగుంట నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.40కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.45కి బయలుదేరి ఉదయం 4.10కి నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement