ముస్లింలకు రక్షణ కరువు | Sakshi
Sakshi News home page

ముస్లింలకు రక్షణ కరువు

Published Thu, Aug 17 2017 3:18 AM

ముస్లింలకు రక్షణ కరువు

హజ్‌యాత్ర ప్రారంభ సభలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పొయిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీతో కలసి ఆయన జెండా ఊపి హజ్‌ యాత్రికుల బస్సును ప్రాంభించారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ సెక్యులరిజాన్ని పరిరక్షిస్తోందని, ముస్లింలకు అండగా ఉంటోందని పేర్కొన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని, ముస్లింల రిజర్వేషన్లను 12 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు. హజ్‌ యాత్రికులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. దేశంలో సెక్యులరిజానికి ముప్పు ఏర్పడిందని షబ్బీర్‌ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల మధ్య సామరస్యం నెలకొనాలని హజ్‌ ఆరాధనల్లో ప్రార్థించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement