బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి విద్యకే ఉంది | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి విద్యకే ఉంది

Published Wed, May 4 2016 3:29 AM

బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి విద్యకే ఉంది

సెస్ డెరైక్టర్ గాలబ్
 
 సాక్షి, హైదరాబాద్: బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) డెరైక్టర్ ఎస్. గాలబ్ అన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తే బాల్య వివాహాల్ని నిరోధించ వచ్చన్నారు. యంగ్‌లైవ్స్ ఇండియా, చిల్డ్రన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఫౌండేషన్ (సిఫ్) బాల్య వివాహాలకు సంబంధించి చేసిన పరిశోధనల వివరాలు తెలిపేందుకు మంగళవారం అమీర్ పేటలోని సెస్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న గాలబ్ మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, శిశు సంరక్షణ కమిటీలు యుక్త వయస్కులతో క్రియాశీలకంగా పనిచేసి బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భవతులవడానికి అడ్డుకట్ట వేయాలన్నారు. యంగ్ లైవ్స్ డెరైక్టర్ రేణు మాట్లాడుతూ.. ‘మా పరిశోధన ప్రకారం 28 శాతం ఆడపిల్లలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు జరిగాయి. ఒక శాతం అబ్బాయిలే 18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లయిన 59 శాతం అమ్మాయిలు 19 ఏళ్ల వయసులోనే మొదటి బిడ్డకు తల్లయ్యారు. 15 ఏళ్ల లోపు చదువు మానేసిన అమ్మాయిలు 18 ఏళ్ల లోపే పెళ్లి చేసుకున్నా రు. ఇది చదువుతున్న వారితో పోలిస్తే నాల్గిం తలు ఎక్కువని తెలిపారు. యంగ్‌లైవ్ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ... నిరుపేదలైన అమ్మాయిలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లవడం, ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయిలతో పోలిస్తే రెండింతలు ఎక్కువని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నిపుణులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement