ఎన్నికల సైరన్ | Sakshi
Sakshi News home page

ఎన్నికల సైరన్

Published Sun, Mar 9 2014 1:11 AM

ఎన్నికల సైరన్ - Sakshi

సార్వత్రిక ఎన్నికల సైరన్ మోగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యూరు. ఏప్రిల్ 30న సిటీలో 1365 ప్రాంతాల్లోని 3300 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఈ ఘట్టాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బందోబస్తు వివరాలతో పాటు అభ్యర్థులు కచ్చితంగా పాలించాల్సిన కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను వివరించారు. ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
 నిబంధనలివీ...  
సిటీలో లెసైన్స్డ్‌ఆయుధాలు కలిగి ఉన్నవారంతా వాటిని డిపాజిట్ చేయాలి.స్థానిక పోలీసుస్టేషన్‌లో లేదా రిజిష్టర్డ్ ఆయుధ డీలర్ వద్ద అప్పగించి రసీదు తీసుకోవాలి.నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో అభ్యర్థి వాహనం సహా మూడింటికే అనుమతి. ప్రచార సమయంలోనూ కాన్వాయ్‌లో గరిష్టంగా 10 వాహనాలే ఉండాలి.{పతి రెండు కాన్వాయ్‌ల మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలి.
కార్లు, జీపులే కాదు... సైకిల్, బైక్, రిక్షాలనూ వాహనాలుగానే పరిగణిస్తారు.ఒక వాహనంపై ఒక బ్యానర్, ఒక జెండా మాత్రమే ఏర్పాటు చేయాలి.మైకులతో సహా ఇతర ఏర్పాట్లు చేయాలంటే రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి.అనుమతి లేకుండా ప్రచారంలో ఉండే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాల నిర్వహణకు స్థానిక డీసీపీ అనుమతి పొందాలి. ఎక్కువ జోన్లలో జరిగే కార్యక్రమమైతే అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అనుమతి పొందాలి. అనుమతి పొందేటప్పుడే వాటి ప్రారంభం-ముగింపు ప్రాంతాలు, మార్గం, సమయం స్పష్టంగా తెలపాలి.

{పముఖులు హాజరైతే ఆ విషయాన్నీ స్పష్టం చేయాలి.దీన్ని బట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు.అనుమతించిన ప్రదర్శన, ర్యాలీలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వహించాలి. కార్యకర్తలు, అభిమానులు ఏమాత్రం నిబంధనలను అతిక్రమించినా.. ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకున్న వ్యక్తిదే బాధ్యత.నామినేషన్లు, ప్రచార సమయంలో జనసమీకరణ చేసినా... వారికి ధనం, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసినా నేరమే. {పచార వాహనాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి విధిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి పత్రం అసలు ప్రతిని వాహనం ముందు భాగంలో ఎడమ వైపున కనిపించేలా అతికించాలి. రిటర్నింగ్ అధికారి అనుమతి పొందిన వాహనాన్ని ఆ నియోజకవర్గంలో ప్రచారానికే అనుమతిస్తారు.  {పచారానికి వినియోగించే లౌడ్ స్పీకర్లు, మైకులకు సైతం స్థానిక పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.ఏ వాహనాన్ని ఈ ప్రచారానికి వినియోగించదలిచారో ఆ నెంబరు కచ్చితంగా చెప్పాలి. 

ఆ వాహనంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క రె న్సీ, మద్యం ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనచోదకుడు, యజమానినీ అరెస్టు చేస్తారు.{పార్థనా స్థలాలను ప్రచారానికి వినియోగించరాదు. ఇళ్ల వద్ద నిరసనలు చేపట్టరాదు.మిగిలిన చోట్లా ఇతరులకు ఇబ్బంది కలిగించని స్థాయిలో ఉదయం 6-రాత్రి 10 మధ్య మైకులను వినియోగించాలి.వైషమ్యాలు రెచ్చగొట్టే, విభేదాలు సృష్టించే ప్రసంగాలు, నినాదాలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేయరాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటివి ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు చేయకూడదు.యజమాని లిఖిత పూర్వక అనుమతితో ప్రైవేట్ వాటిపైనే ఇవి ఏర్పాటు చేసుకోవాలి.ఇలాంటి వాటితో పాటు కటౌట్ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ స్థలాలు కేటాయిస్తోంది.అక్కడ అన్ని పార్టీకు సమాన హక్కులు ఉంటాయి.

ఎన్నికల ప్రచారానికి సంబంధించి పోలీసులు ఇచ్చే అనుమతులన్నీ మొదట వచ్చిన దరఖాస్తుకు తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన ఉంటాయి.
ఎక్కువమంది అభ్యర్థులు ఒకే ప్రాంతంలో ప్రచారం నిర్వహించాలని కోరుకుంటే శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు.అన్ని పార్టీలు, అభ్యర్థులకు సమన్యాయం జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.{పతి సమావేశం, ర్యాలీ, సభలను ఆద్యంతం వీడియోల ద్వారా చిత్రీకరిస్తారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు.
 

 ‘పాత’ వాటిపై స్పెషల్‌డ్రైవ్స్...
 గత ఎన్నికల సందర్భంలో నమోదైన నేరాలపై నగర పోలీసులు సమీక్ష చేస్తున్నారు. అప్పట్లో సమస్యలు సృష్టించిన వారితో పాటు రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను బైండోవర్ చేస్తున్నారు. ఇప్పటికే 112 మందిని బైండోవర్ చేశారు. అప్పటి ఎన్నికల నేరాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సిటీలో ఉన్న 4000 గానూ 114 లెసైన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించారు. కొత్త ఆయుధ లెసైన్సుల జారీపై నిషేధం విధించారు. దాదాపు గత ఏడాది మాదిరిగానే బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స్థాయిలో సిబ్బందిని మోహరిస్తున్నా... అవసరమైతే మరికొంత ఎక్కువ పంపడానికి డీజీపీ ప్రసాదరావు ఆమోదం తెలిపారు. అప్పటి రికార్డుల్లో ఉన్న సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలతో పాటు కొత్తగా ఈ కోవలోకి చేరే వాటినీ డీసీపీలు అధ్యయనం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement