హైదరాబాద్‌ ఇంజనీర్లకు ఆ నైపుణ్యం లేదట | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఇంజనీర్లకు ఆ నైపుణ్యం లేదట

Published Sun, May 7 2017 9:45 PM

హైదరాబాద్‌ ఇంజనీర్లకు ఆ నైపుణ్యం లేదట

హైదరాబాద్: దేశంలో కీలక నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో ఇంజినీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు చాలా వెనుకబడి ఉన్నారని ఓ అధ్యాయనం తేల్చింది. హైదరాబాదీ విద్యార్థుల్లో ప్రోగ్రామింగ్ చేసే నైపుణ్యం చాలా తక్కువగా ఉందని అటోమట నేషనల్‌ ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ చెప్పింది. అతి కొద్ది మందికి మాత్రమే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు రావడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపింది.

దేశవ్యాప్తంగా 500 కాలేజీల్లోని 36వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు వివరించింది. విద్యార్థుల్లో లోపిస్తున్న ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవడానికి తాము కోడింగ్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలను భావిస్తున్నట్లు వెల్లడించింది. నగరానికి చెందిన గ్రాడ్యుయేట్లలో 0.7 శాతం మంది మాత్రమే ప్రాథమికంగా కోడ్‌ రాసే శక్తిసామర్ధ్యాలను కలిగివున్నారని నివేదికలో ఉంది. నివేదికపై తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో సుజీవ్ నాయర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగావకాశాలు పెంచేందుకు కాలేజీ స్థాయిలో ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement