వచ్చే ఏడాది 4జీ సేవల విస్తరణ | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది 4జీ సేవల విస్తరణ

Published Tue, Sep 12 2017 12:04 AM

వచ్చే ఏడాది 4జీ సేవల విస్తరణ

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీజీఎం అనంతరామ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4జీ సేవలను విస్తరించనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ సీజీఎం అనంతరామ్‌ తెలిపారు. అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను 3జీలోకి మార్చే పని దాదాపు పూర్తయిందని, 10 శాతం కన్వర్షన్‌ మాత్రమే మిగిలిం దని సోమవారం చెప్పారు. గ్రామాల్లో వైఫై హాట్‌స్పాట్‌లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 50 హాట్‌స్పాట్లుండగా డిసెంబర్‌కి ఈ సంఖ్య ను 550కు చేర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.

హైదరాబాద్‌ మెట్రో కారిడార్లలో వైఫై వసతి కల్పిస్తున్నామని, ఇందుకోసం 64 సైట్స్‌ ఎంపిక చేయగా, ఇప్పటికే నాగోల్, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, భరత్‌నగర్, బాలానగర్, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, ఎస్‌ఆర్‌నగర్‌లలో ప్రారంభించామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా ప్రవేశపెడుతున్న మొబైల్‌ ప్లాన్లకు మంచి స్పందన ఉంటోందన్నారు. బీఎస్‌ఎన్‌ల్‌ సిక్సర్‌–666 ప్లాన్‌ కూడా ఆశాజనకంగా ఉందన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement