విద్యార్థి సంఘాల ఆందోళనలతో అట్టుడికిన వర్సిటీ
హైదరాబాద్: తమ సంఘ నాయకులను దూషిస్తూ ఏబీవీపీ నాయకుడు ఫేస్బుక్లో కామెంట్లు చేశారని ఓ సంఘం.. తమపై దాడి చేశారని మరో సంఘం నాయకులు పోటాపోటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనలకు దిగాయి. ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వర్సిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు వచ్చి ఆందోళనకు మద్దతు పలికారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వారిని శిక్షించండి: ఏఎస్ఏ
అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులను గూండాలుగా పేర్కొంటూ ఫేస్బుక్లో కామెంట్స్ చేసిన సుశీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఏ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్ఏ సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులను, అణగారిన వర్గాలను కించపరిచేలా ఏబీవీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఈ కామెంట్లు దానిలో భాగమేనని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ, డీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ఓబీసీఏ, టీఆర్ఎస్వీ సంఘాల నేతలూ ఆందోళనలో పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న ఏఎస్ఎ నాయకులను పోలీసులు విడుదల చేశారు.
కమిటీ ఏర్పాటు చేస్తాం: వీసీ
వివాదంపై అధికారులు, అధ్యాపకులతో కమిటీ వేసి నిజానిజాలు తేలుస్తామని విద్యార్థి నాయకులకు వర్సిటీ వీసీ ఆర్పీ శర్మ హామీ ఇచ్చారు. గొడవపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హెచ్‌సీయూలో 'ఫేస్బుక్' వార్
Published Wed, Aug 5 2015 9:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement