‘ఫీజు’ బకాయిలకు కొర్రీలు | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ బకాయిలకు కొర్రీలు

Published Mon, Aug 22 2016 1:52 AM

‘ఫీజు’ బకాయిలకు కొర్రీలు

నాలుగో వంతే ఇవ్వాలంటూ ట్రెజరీలకు ఆర్థిక శాఖ ఆంక్షలు

 సాక్షి, హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు మరో బ్రేక్ పడింది. ఆర్థిక శాఖ కొర్రీల కారణంగా నాలుగో వంతు మాత్రమే విడుదలకు నోచుకున్నాయి. తాజాగా 4 భాగాలుగా ఈ ఫీజులను చెల్లించాలనే అంతర్గత ఆదేశాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థుల ఫీజుల బకాయిలు అందక కాలేజీల యాజమాన్యాలు సైతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 2014-15, 2015 -16  సంవత్సరాల ఫీజు బకాయిలన్నింటిని ఒకేసారి చెల్లిస్తున్నట్లుగా ప్రకటిస్తూ గత ఏప్రిల్ 19న రూ.3 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల ఉత్తర్వులు(బీఆర్వోలు) ఇచ్చింది.

ఫీజు బకాయిలు పెరిగిపోకుండా ఉండేందుకు  2016-17 విద్యాసంవత్సరం నుంచే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లించనున్నట్లు కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం హామీనిచ్చింది. గత రెండేళ్ల బకాయిలే పెద్దమొత్తంలో పేరుకుపోగా, ఇంకా ఈ ఏడాది ఫీజుల చెల్లింపు ఇంకా మొదలేకాలేదు. ఫీజు బకాయిల చెల్లింపునకు సంబంధిం చి తాము శాఖాపరంగా మంజూరు ఇచ్చి పంపుతు న్నా ట్రెజరీ నుంచి నిధులు విడుదల కావడం లేదని ప్రభుత్వం దృష్టికి ఎస్సీ అభివృద్ధి శాఖ తీసుకొచ్చింది. ఆర్థిక శాఖ కొర్రీలను ఎత్తేసి ఫీజు బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఫీజు బకాయిలు అందక అయోమయంలో ఉన్నామని, సీఎంతో భేటీలో బకాయిలన్నీ చెల్లిస్తామన్నారని, కానీ అధికారుల నుంచి ఏమాత్రం సానుకూల స్పందన లేదని తెలంగాణ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ గౌతమ్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement