Sakshi News home page

ప్రాజెక్టులపై డ్రామాలాడుతున్నారు

Published Wed, Jan 4 2017 1:41 AM

ప్రాజెక్టులపై డ్రామాలాడుతున్నారు - Sakshi

చంద్రబాబుపై ధ్వజమెత్తిన గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోని అవినీతిని ఎండ గడుతుంటే తట్టుకోలేకనే టీడీపీ నేతలు తమ పై ఎదురుదాడికి దిగుతున్నారని వైఎస్సార్‌ సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టంచేశారు. ప్రాజెక్టులపై తమ వైఖరి ఏంటనేది రాష్ట్రంలో చిన్న పిల్లవాడికి కూడా తెలుసునని చెప్పారు. ప్రాజెక్టులన్నీ వైఎస్‌ హయాంలోనే ప్రారంభమయ్యాయన్న సంగ తి చంద్రబాబుకూ తెలుసునని, దాన్ని కప్పి పుచ్చేందుకు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ.. తమ పాలనలో ఇప్పటివరకూ ఏ ఒక్క మేలు కూడా చేయ లేకనే టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.  ప్రాజె క్టులకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని మాట్లాడితే (ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి) నాలుకలు కోసేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతినే ఎండగడుతున్నాం: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోని అవినీతినే తాము ఎండగట్టామని గడికోట స్పష్టం చేశారు. వైఎస్‌ తన హయాంలో రూ 10,600 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రయ త్నిస్తే... చంద్రబాబు ఇపుడు దాని అంచ నాలను రూ.40 వేల కోట్లకు పెంచి దోపిడీ చేస్తున్నా రని దుయ్యబట్టారు. పోలవరం కుడికాలు వలో 30 కిలోమీటర్లు పనులు జరక్కుండా ఆగడానికి కారణం ఎవరో విచా రణ జరిపిం చే ధైర్యం దమ్ము చంద్ర బాబుకు ఉందా? అని సవాలు చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరిస్తామని ఓ వైపు చెబుతూ, మరోవైపు లిఫ్టు ఇరిగేషన్‌ పథకాలు పెట్టి రూ. 1,600 కోట్లు ఎందుకు వృథా చేశారని ప్రశ్నించారు.

పోలవరానికి కేంద్రం నుంచి అన్ని అనుమతులూ తెచ్చినందుకు వైఎస్‌కు జూబ్లీహాలులో సన్మానం జరిగిన సంఘటనను చంద్రబాబు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 1994–2004 మధ్య చంద్రబాబు సాగునీటి రంగానికి రూ 10 వేల కోట్లు ఖర్చు చేస్తే, అదే వైఎస్‌ హయాంతో కలిపి 2004 నుంచి 2014 వరకూ రూ 95 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.  అనంతపురం జిల్లాను దోచుకోవడానికి అలవాటు పడ్డ జేసీ... తనను ఎక్కడ జైల్లో పెట్టిస్తారోననే భయంతో జగన్‌ను ఇష్టానుసారం విమర్శిస్తూ చంద్రబాబును సంతోషపెడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా జేసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆఖరిదశలో ఉన్న జేసీ రాజకీయ జీవితం మరుగున పడిపోతుందని హెచ్చరించారు. 

Advertisement
Advertisement