నేటి నుంచి హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు

Published Sun, Feb 8 2015 2:03 AM

HCU entrance exams from today

 సెంట్రల్ యూనివర్సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభమై ఈ నెల 14 వరకు కొనసాగుతాయి. దేశవ్యాప్తంగా 37 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి 131 కోర్సుల్లో మొత్తం 2,068 సీట్లకు హెచ్‌సీయూ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈసారి దేశవ్యాప్తంగా 44,224 దరఖాస్తులు అందగా, అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 14,477 దరఖాస్తులు వచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ వి.కృష్ణ తెలిపారు.
 

Advertisement
Advertisement