నేరెళ్ల బాధితులకు వైద్యం అందించాలి | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాధితులకు వైద్యం అందించాలి

Published Sat, Sep 9 2017 3:07 AM

నేరెళ్ల బాధితులకు వైద్యం అందించాలి

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై కేసులు పెట్టి, చిత్రహింసలకు పాల్పడిన ప్రభుత్వం, ఇప్పుడు వారికి వైద్యం కూడా అందకుండా అడ్డుకుంటోందని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులను పోలీసులు నిర్బంధించి, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని విమర్శించారు. ప్రభుత్వం దళితుల పట్ల కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు.

బాధిత దళితులకు వైద్యం అందించకుండా అడ్డుకుంటే పక్కరాష్ట్రాల్లో చేయిస్తామని చెప్పారు. పోలీసులు తీవ్రంగా హింసించడంతో వారు అనారోగ్యానికి గురయ్యారని వారిని నిమ్స్‌లో చేర్పిస్తే పాలకులు బెదిరించారని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. నిమ్స్‌ ఆసుపత్రి అధికారులకు అర్ధరాత్రి ఫోన్లు చేసి, దళితులను బయటకు గెంటేశారన్నారు. ఇంత నియంతృత్వ పాలనను ఎక్కడా చూడలేదన్నారు. బాధితులను కాపాడే ప్రయత్నాలు చేయకుంటే ఈ నెల 15న నేరెళ్లలో దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement